మంచు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మనోజ్(Manoj) ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే తన వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమైనటువంటి మనోజ్ తాజాగా రెండో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఈయన గత కొంతకాలంగా భూమా మౌనిక రెడ్డి(Bhuma Mounika Reddy)తో రిలేషన్ లో ఉంటూ మార్చి మూడవ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో భూమా మౌనికను వివాహం చేసుకున్నారు.
ఇలా వివాహం తర్వాత మనోజ్ మౌనిక దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా భూమా అఖిలప్రియ (Akhila Priya)నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో భూమా మౌనిక రెడ్డి తన అక్కతో చిన్నప్పటి స్కూల్లో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అఖిలప్రియకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా భూమా మౌనిక తన అక్క అఖిల ప్రియకు శుభాకాంక్షలు చెబుతూ షేర్ చేస్తున్నటువంటి పోస్టును మనోజ్(Manoj) రీ పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్ డే వదినమ్మ అంటూ ఎంతో ఆప్యాయంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ విధంగా మంచు మనోజ్ అఖిలప్రియను వదినమ్మ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఈ పోస్ట్ చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పోస్టును వైరల్ చేస్తున్నారు.అతి తక్కువ సమయంలోనే భూమా ఫ్యామిలీతో మనోజ్ కు చాలా మంచి ఆప్యాయత ఏర్పడిందని భావిస్తున్నారు.ఇకపోతే గత కొద్దిరోజుల క్రితం మనోజ్ మంచు విష్ణు(Manchu Vishnu)తో పెద్ద ఎత్తున గొడవపడిన విషయం మనకు తెలిసింది.
ఈ వీడియో పెద్ద ఎత్తున వివాదంగా మారింది అయితే ఇదంతా కేవలం ఓ రియాలిటీ షో కోసం మాత్రమే అంటూ విష్ణు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన ఈ వీడియో పై మాత్రం పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.







