అమెజాన్ చేతికి పొన్నియిన్ సెల్వన్ డిజిటల్ రైట్స్.. ఎంత పలికాయంటే..!

సౌత్ స్టార్ డైరక్టర్స్ లో ఒకరైన మణిరత్నం డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ పొన్నియిన్ సెల్వన్.

కోలీవుడ్ స్టార్స్ చియాన్ విక్రం, కార్తి, జయం రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.

తమిళ బాహుబలిగా ప్లాన్ చేస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమాను కూడా రెండు భాగాలుగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఈ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ ఫిక్స్ చేశారు.

లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ అదిరిపోతుందని తెలుస్తుంది.ముఖ్యంగా సినిమా డిజిటల్ రైట్స్ అమేజాన్ ప్రైం భారీ మొత్తానికి సొంతం చేసుకుందని తెలుస్తుంది.

పొన్నియిన్ సెల్వన్ సినిమాని అమేజాన్ ప్రైం అన్ని భాషల డిజిటల్ రైట్స్ 125 కోట్లకు తీసుకున్నారట.ఇంకా శాటిలైట్ రైట్స్ కూడా ఇదే రేంజ్ లో భారీ రేంజ్ లో అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, త్రిష వంటి హీరోయిన్స్ నటిస్తున్నారు. అమేజాన్ ప్రైం 125 కోట్లకు ఈ సినిమాను కొన్నది అంటే సినిమాపై ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

తమిళ చలన చిత్ర పరిశ్రమలో ఈ సినిమా ఓ అద్భుతమైన సినిమాగా నిలిచిపోవాలని కోరుతున్నారు అక్కడ సినీ ప్రేక్షకులు.

Advertisement

తాజా వార్తలు