కలెక్షన్లు పెంచి చెబుతున్న చిరంజీవి క్యాంప్ ?     2017-01-14   22:37:31  IST  Raghu V

సినిమా కలెక్షన్లు ఎంత ఎక్కువ కనిపిస్తే హీరో రేంజ్ అంత పెరిగినట్లు. కాని ఇక్క రేంజ్ పెంచే అవసరం ఏముంది ? మెగాస్టార్ చిరంజివి అక్కడ. మహేష్, పవన్, ఎన్టీఆర్ .. ముగ్గురిని నిద్రలేపి అడిగిన ఆయనే నెం.1 నిర్మొహమాటంగా చెబుతారు. ఆయన కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఖైదీనం 150 సినిమా చాలా బాగా ఆడుతోంది, బాహుబలిని మినహాయిస్తే, సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్తోంది. అయినా, ఎందుకో, అల్లు అరవింద్ అండ్ టీమ్, కలెక్షన్లు పెంచి చెబుతున్నారని టాక్.

మరి పోటిలో ఉన్న సినిమాల హైప్ ని మీడియాలో దెబ్బతీసే ఉద్దేశ్యమా లేక, చిరంజీవి దరిదాపుల్లో కూడా ఎవరు కనబడకూదు అనే భావమో తెలియదు కాని, ట్రేడ్ రిపోర్ట్స్ ఒకలా ఉంటే, చిరంజీవి పీఆర్ టీమ్ కలెక్షన్లు మరోలా ఉన్నాయి.

ఓ ప్రముఖ పీఆర్వో, నిర్మాత నిన్న ఖైదీనం 150 కి సంబంధించి ఓ ఏరియా కలెక్షన్లు తెలియజేశారు. అది మెగా క్యాంప్ మీడియాలో ప్రచారం చేయిస్తున్న నంబర్ కంటే తక్కువే. దాంతో మెగా క్యాంప్ వెంటనే ఆ పీఆర్వోకి ఫోన్ చేసి మందలించారని, ఆయనిచ్చిన రిపోర్టు డిలీట్ చేయించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ విషయాలన్ని ట్రేడ్ వరకే పరిమితం … సామాన్య ప్రజలకి మీడియా తెలియజేసిందే వేదవాక్కు. ఇక మీడియాకి పీఆర్ టీమ్ చెప్పిందే వేదవాక్కు.