పాపం త్రిషని ముప్పుతిప్పలు పెట్టారుగా

జల్లికట్టుని వ్యతిరేకరించే పెటా సంస్థతో త్రిషకి సంబంధం ఉండటం వలన కొందరు జల్లికట్టు ప్రోత్సాహికులు మొన్న త్రిష షూటింగ్ ని అడ్డుకోని, త్రిష వానిటి వ్యాన్ ని చుట్టుముట్టి నానా హంగామా చేసారన్న విషయం తెలిసిందే.

 Jallikattu Issue : Trisha Deactivates Her Twitter-TeluguStop.com

ఈ సంఘటన మీద స్పందించిన త్రిష, ఇదేనా తమిళ సంస్కారం, ఇలాంటి భాషేనా మీరు ఉపయోగించేది అంటూ మొదలుపెట్టి, అవును నేను పెటా సపోర్టని అంటూ క్లాస్ పీకి, ఆ తరువాత నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేసారని చెప్పుకొచ్చింది.

త్రిషకి జల్లికట్టు ప్రోత్సాహికులు ట్విట్టర్ చెడు భాషలో రిప్లైలు పెట్టేసారు.పాపం, మనసుకి కష్టం కలిగిందేమో .తన ట్విట్టర్ అకౌంట్ ని డియాక్టివేట్ చేసేసుకుంది.అయితే, తానెప్పుడూ జల్లికట్టుకి వ్యతిరేకంగా మాట్లాడలేదని అంతకుముందు చెప్పుకొచ్చింది త్రిష, అయినా తన మీద నెగెటివ్ కామెంట్స్ ఆపకపోవడంతో అకౌంట్ డియాక్టివేట్ చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube