ఇటీవల వైసిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయిన వైసీపీ సీనియర్ నేత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి( YCP Senior Leader Alla Ramakrishna Reddy ) మళ్ళీ సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు వైసీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల అడుగుపెట్టిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమె వెంట నడిచారు .ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగానూ నియామకం కావడం తో , ఆళ్ల కూడా కీలకం అవుతారని అంతా భావించారు.అయితే కాంగ్రెస్ లో ఆయన ఇమడ లేకపోవడం, ఆళ్ళ అనుచరులు మళ్ళీ వైసీపీలో చేరాల్సిందిగా ఒత్తిడి తేవడం తదితర కారణాలతో ఆయన మళ్లీ వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే ను తప్పించి గంజి చిరంజీవికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకోవడంతో అసంతృప్తికి గురైన ఆళ్ల కాంగ్రెస్ లో చేరిపోయారు.
అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేగా మొన్నటి వరకు దక్కిన గౌరవం ఇప్పుడు లభించకపోవడం, మళ్లీ వైసీపీలో( YCP ) చేరాల్సిందిగా అనుచరులు ఒత్తిడి తీసుకొస్తూ ఉండడంతో ఆలోచనల పడ్డ ఆర్కే వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.రెండు రోజుల క్రితం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తో పార్టీలో చేరే విషయమై చర్చించారు.ఆళ్ల చేరికకు జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఈరోజు వైసీపీ రాజ్యసభ ఎంపీ, తన సోదరుడు అయోధ్య రామిరెడ్డి( Ayodhya Ramireddy ) తో కలిసి ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ ను కలవబోతున్నారు.ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వైసీపీలో చేరే అవకాశం ఉంది .ప్రస్తుతం మంగళగిరి వైసీపీ ఇన్చార్జిగా ఉన్న గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లభించకపోవడంతో ఆయనను మార్చుతారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతుంది.ఈ నేపథ్యంలోనే మళ్లీ వైసీపీలో చేరబోతుండడంతో ఆయనకు జగన్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
అయితే చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న మంగళగిరిలో ఆ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని పోటికి దింపుతే మంచిదనే ఆలోచనతోనే జగన్ వాళ్ళను తప్పించి గంజి చిరంజీవి( Ganji Chiranjeevi )కి టికెట్ ను ఇచ్చారు.ఇక్కడ టిడిపి అభ్యర్థిగా నారా లోకేష్( Nara Lokesh ) పోటీ చేయబోతుండడంతో ఇక్కడ వైసిపి గెలుపును జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.గంజి చిరంజీవికి టికెట్ ఇవ్వడంపై అదే సామాజిక వర్గానికి చెందిన వైసిపి కీలక నేతలు ఆ సామాజిక వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల అసంతృప్తికి గురవడం వంటివి చోటు చేసుకున్నాయి .ఇప్పుడు ఆర్కే చేరికతో మంగళగిరి అభ్యర్థి విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.