శనగ( Peanut ) శీతాకాలపు పంట.నీటి వనరులు తక్కువగా ఉండే నల్ల రేగడి నేలలలో( black peat soils ) అధిక విస్తీర్ణంలో శనగ పంట సాగు అవుతుంది.
శనగ పంటకు మంచు చాలా అవసరం.కాబట్టి శనగ పంటను అక్టోబర్ నుండి నవంబర్ మధ్య విత్తుకోవాలి.
తక్కువ శ్రమతో కూడిన పంటలలో శనగ పంట కూడా ఒకటి.శనగ పంట సాగుకు నల్లరేగడి నేలలతో పాటు తేమశాతం ఎక్కువ కాలం ఉండే బరువైన నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.
నేల యొక్క పీహెచ్ విలువ 6-7 ఉండే నేలలు సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఒక ఎకరం పొలానికి దాదాపుగా 30 కిలోల విత్తనాలు అవసరం.ఒక కిలో విత్తనాలకు 2.5 గ్రాముల థైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి.విత్తనం విత్తుకోవడంలో ఆలస్యం అయితే పూత రాలిపోయే అవకాశాలు చాలా ఎక్కువ.కాబట్టి అక్టోబర్ నుండి నవంబర్ మధ్యలో, నేలలో కొద్దిగా తేమ ఉన్నప్పుడు విత్తుకోవాలి.విత్తిన 48 గంటల్లో ఒక లీటరు నీటిలో ఐదు మి.లీ పెండిమిథలిన్ ( Pendimethalin )ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.ఇలా చేస్తే దాదాపుగా కలుపు సమస్య ఉండదు.శనగ పంటకు నీటి అవసరం చాలా తక్కువ.పూత మొదలయ్యే 30-35 రోజుల మధ్య, గింజ బలపడే దశలో నీటి తడులు అందించాలి.

శనగ పంటకు తెగుళ్ల బెడద( Pests ) కంటే చీడపీడల బెడద చాలా ఎక్కువ.పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఏమైనా చీడపీడలు ఆశిస్తే సకాలంలో వాటిని గుర్తించి తొలి దశలోనే అరికట్టాలి.శనగ పంటకు పచ్చ రబ్బరు పురుగుల బెడద చాలా ఎక్కువ.
ఈ పురుగులు గుంపులు గుంపులుగా చేరి ఆకులను తినేసి, ఆకులను జల్లెడలాగా మారుస్తాయి.ఈ పురుగులను గుర్తించి అరికట్టడంలో ఆలస్యం జరిగితే ఊహించని నష్టం జరుగుతుంది.
ఈ పచ్చ రబ్బరు పురుగుల నివారణకు ఒక లీటరు నీటిలో ఒక గ్రాము ఎసిఫేట్ ను కలిపి పిచికారి చేయాలి.లేదంటే ఒక లీటరు నీటిలో రెండు గ్రాముల తయోడికార్బ్ ను కలిపి పిచికారి చేసి పూర్తిగా అరికట్టాలి.







