డైరెక్టర్ ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా జిన్నా.ఈ సినిమాలో మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ కీలక పాత్రలో నటించగా.
వెన్నెల కిషోర్, సునీల్, సురేష్, నరేష్, రఘు బాబు, సత్యం రాజేష్, చమ్మక్ చంద్ర, భద్రం, సద్దాం తదితరులు నటించారు.ఇక ఈ సినిమాను ఏవిఎ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించాడు.
అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు.ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించాడు.
ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.ఈ సినిమా ట్రైలర్ తో భారీ అంచనాలు వెలుపడ్డాయి.
అయితే ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.ఇక మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణుకు ఎటువంటి సక్సెస్ అందిందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.ఇందులో జిన్నా తిరుపతిలో ఉంటాడు.
అయితే జిన్నా తన ఫ్రెండ్స్ తో కలిసి తిరుపతిలో టెంట్ హౌస్ నడుపుతుంటాడు.అయితే జిన్నా ఒక గుండా దగ్గర అప్పులు చేస్తాడు.
ఆ అప్పులు తీర్చలేక పరారీలో ఉంటాడు.ఇక చివరికి ఆ గుండా జిన్నా ని పట్టుకుంటాడు.
దీంతో జిన్నా తనకు అప్పు తీర్చడానికి ఒక షరతు కూడా పెడతాడు.అదేంటంటే తన సోదరి సన్నీ లియోన్ ను పెళ్లి చేసుకోమని అంటాడు.
ఇక చేసేదేమీ లేక జిన్నా పెళ్లికి ఒప్పుకుని తన ఇంట్లో ప్రవేశిస్తాడు.ఇక ఇక్కడే అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.
చివరికి ఇంట్లో ఏం జరుగుతుంది.ఇక పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది.
మధ్యలో జరిగే ట్విస్టులు ఏంటి.ఎదురయ్యే సంఘటనలు ఏంటి అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
విష్ణు కామెడీ పండించడంలో మరింత హైలెట్ గా నిలిచాడు.తన పాత్రతో ఆకట్టుకున్నాడు విష్ణు.ఇక సన్నీలియోన్ గ్లామర్ షో బాగా చేసింది.పాయల్ రాజ్ పుత్ కూడా బాగానే నటించింది.మిగతా నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా ఈ సినిమా ఎందుకో అంతగా ఆకట్టుకోలేకపోయింది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఆకట్టుకోలేదు.సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు అన్నట్టుగా అనిపించింది.ఎడిటింగ్లో కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేది.
విశ్లేషణ:
కథ రొటీన్ గా అనిపించిన కూడా కొన్ని సన్నివేశాలు మాత్రం బాగా హైలైట్ గా ఉన్నాయి.ఇక కామెడీ సీన్స్ మాత్రం బోరింగ్ అన్నట్లుగా సాగింది.సెకండ్ హాఫ్ లో కాస్త వేగం తగ్గినట్టు అనిపించింది.
ప్లస్ పాయింట్స్:
కామెడీ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి.కొన్ని డైలాగ్స్ బాగున్నాయి.రొమాంటిక్ సీన్స్ కూడా పరవాలేదు.
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథగా అనిపించింది.కొన్ని సన్నివేశాలను బాగా సాగదీశారు.బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
బాటమ్ లైన్:
చివరిగా ఈ సినిమా హారర్, కామెడీ నేపథ్యంలో రూపొందగా.ఈ సినిమాను ఫ్యామిలీతో చూడవచ్చు అని చెప్పవచ్చు.రొటీన్ కథగా అనిపించినా కూడా పరవాలేదు అన్నట్లుగా ఉంది.