జిన్నా మూవీ బుకింగ్స్ అలా ఉన్నాయా.. విష్ణుకు మరో షాక్ తప్పదా?

ఈ నెల 21వ తేదీన ఏకంగా 4 సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో సినిమాలకు థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

దీపావళి పండుగ ఉండటంతో ఓరి దేవుడా, ప్రిన్స్, జిన్నా, సర్దార్ సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నయి.

ఈ నాలుగు సినిమాలలో రెండు స్ట్రెయిట్ సినిమాలు కాగా మరో రెండు సినిమాలు కోలీవుడ్ సినిమాలు అనే సంగతి తెలిసిందే.మరోవైపు థియేటర్లలో కాంతార మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

దీపావళి కానుకగా విడుదలవుతున్న సినిమాలకు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయనే సంగతి తెలిసిందే.మంచు విష్ణు హీరోగా పాయల్, సన్నీ హీరోయిన్లుగా తెరకెక్కిన జిన్నా మూవీ తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో బుకింగ్స్ లేవనే సంగతి తెలిసిందే.

ప్రముఖ థియేటర్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్ లో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన రేంజ్ లో లేకపోవడం గమనార్హం.

Advertisement

చాలా తక్కువ సంఖ్యలో ఈ సినిమాకు బుకింగ్స్ జరగగా ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు సైతం మరీ భారీగా ఉండకపోవచ్చని తెలుస్తోంది.సినిమాకు క్రిటిక్స్ నుంచి నెటిజన్ల నుంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే జిన్నా మూవీ బాక్సాఫీస్ వద్ద సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.విష్ణు మాత్రం ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో చేరుతుందని బలంగా నమ్ముతున్నారు.

జిన్నా సినిమాతో పోల్చి చూస్తే ఓరి దేవుడా బుకింగ్స్ బెటర్ గా ఉన్నా ఈ సినిమాకు కూడా బుకింగ్స్ మరీ భారీ రేంజ్ లో లేవు.వెంకటేష్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ కు పరిమితం కావడంతో వెంకటేష్ అభిమానులు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.కాంతార సినిమాకు మాత్రం బుకింగ్స్ బాగున్నాయి.

సర్దార్, ప్రిన్స్ సినిమాలకు కొన్ని థియేటర్లలో బుకింగ్స్ బాగున్నాయి.

అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు