వైసీపీలోకి మోహన్ బాబు ? అసలు వ్యూహం ఇదేనా ?

గత కొద్ది రోజులుగా సినీ నటుడు మంచు మోహన్ బాబు టాపిక్ ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత చంద్రబాబుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని తమ కాలేజీ విద్యార్థులతో కలిసి మోహన్ బాబు ధర్నా చేయడం ఆయన్ను హౌస్ అరెస్ట్ చేయడం మొదలైన పరిణామాలతో వాతావరణం హీట్ ఎక్కింది.

చంద్రబాబు మీద మోహన్ బాబు విమర్శలు చేయడం దానికి కౌంటర్ గా టిడిపి నుంచి కుటుంబరావు ప్రతి విమర్శలు చేయడం మొదలైనవన్నీ జరిగిపోయాయి.మోహన్ బాబు ఎన్నికల కీలక సమయంలో ఈ విధంగా చేస్తాడని అని ఎవరూ ఊహించలేదు.

ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటునాడని అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కీ రోల్ పోషించాలని చూస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే తిరుపతిలో లో మోహన్ బాబు కాలేజీకి చెందిన విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం తమను వేధిస్తోందని మోహన్ బాబు ఆందోళన చేసినట్టు టీడీపీ అనుమానిస్తోంది.

మోహన్ బాబు విద్యా వ్యాపారం చేస్తున్నాడని కూడా టీడీపీ తరపున కుటుంబరావు గట్టిగా మాట్లాడాడు.మోహన్ బాబు తరపున అయన కుమారులు విష్ణు, మనోజ్ ఘాటుగా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.

Advertisement

ఇదంతా ముగిసిపోయింది అనుకుంటుండగానే మోహన్ బాబు వైసీపీ లో చేరిపోవడం ఖాయం అనే వార్తలు మొదలయ్యాయి.

రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ఏపీ అంతా చంద్రబాబు కి వ్యతిరేకంగా ప్రచారం చేయాలనీ, ఆ తరువాత పార్టీ అధికారంలోకి వస్తే రాజ్య సభ సీటు కోరాలని చూస్తున్నట్టు ప్రచారం మొదలయింది.గతంలో టీడీపీ తరపున ఎన్టీఆర్ చేతిలో ఉన్నప్పుడు మోహన్ బాబు రాజ్యసభకు నామినేట్ అయ్యారు.మరి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.

అయితే మోహన్ బాబు వైసీపీ లో చేరతాడు అనే ప్రచారం ఊపందుకున్నా వైసీపీ నుంచి కానీ మంచు ఫ్యామిలీ నుంచి కానీ ఎటువంటి ప్రకటన బయటకి రాలేదు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు