మోహన్ బాబు వారసుడిగా వెండితెరకు పరిచయమైన మంచు మనోజ్ అనుకున్నంతగా రాణించలేక పోయాడు.ఒకటి రెండు సినిమాలతో హిట్ కొట్టిన మళ్ళీ వరస ప్లాపులతో రేస్ లో వెనుక పడ్డాడు.
దీంతో మంచు మనోజ్ చాలా రోజులుగా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.ఇక ఈయన సినిమాలు చేయక పోవడం మళ్ళీ తన భార్య ప్రణతి రెడ్డి తో విడాకులు తీసుకోవడం ఇలా అన్ని కూడా వెంటవెంటనే జరిగి పోయాయి.
2015 లో పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ 2019లో విడాకులు తీసుకున్నారు.ఇక ఆ తర్వాత మనోజ్ రెండో పెళ్లిపై చాలా రూమర్స్ వస్తున్నాయి.
ఈయన మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది అని వార్తలు వచ్చాయి.ఇక ఇటీవలే మంచు మనోజ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టులు పెడుతూ అందరిలో క్యూరియాసిటీ పెంచేసాడు.

మరి ఈయన పెళ్లి గురించే రివీల్ చేస్తాడేమో అని అంతా అనుకున్నారు.కానీ అందరికి షాక్ ఇస్తూ ఈ రోజు ఈయన నుండి సాలిడ్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.ఈయన కొత్త సినిమా చేయబోతున్నట్టు రివీల్ చేశారు.”వాట్ ది ఫిష్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను రివీల్ చేస్తూ దీనికి క్యాప్షన్ గా మనం మనం బరంపురం అంటూ పోస్టర్ ఆసక్తికరంగా ఉండేలా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

మరి ఈ ప్రీ లుక్ పోస్టర్ చూస్తుంటే మంచి యాక్షన్ మోడ్ లో కనిపిస్తుండగా మనోజ్ ఈ సినిమాతో మళ్ళీ సాలిడ్ ట్రాక్ లోకి వస్తాడా అని అంతా చర్చించు కుంటున్నారు.ఈ సినిమాపై తాను బాగా ఎగ్జైట్ గా ఉన్నాను అని మళ్ళీ తనపై ప్రేమను తిరిగి ఇస్తానని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు.ఇక ఈ సినిమాను 6 సిక్స్ సినిమాస్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమా మొత్తం విదేశాల్లో షూటింగ్ జరుపు కుంటుంది.చూడాలి ఈ సినిమాతో మంచువారబ్బాయి ఎలాంటి కమ్ బ్యాక్ ఇస్తాడో.







