ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ అయినటువంటి మైఖేల్ క్లార్క్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు.ఈ సారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమై చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.
ఇక పొతే గత కొంత కాలంగా తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి ‘జాడే యార్‌బ్రో’కి మైఖేల్ క్లార్క్‌కి మధ్య కొన్ని అభిప్రాయభేదాలు తలెత్తిన సంగతి అందరికీ తెలిసినదే.ఈ క్రమంలో తనను మోసం చేశాడని క్లార్క్ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి కూడా తెలిసినదే.
అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వారిద్దరికీ సంబంధించినటువంటి చెంపదెబ్బ వీడియో ఒకటి ఎక్కువగా వైరల్ అవుతోంది.ఈ వీడియోలో క్లార్క్‌ను ఆమె పబ్లిక్‌గా చెంపదెబ్బ కొట్టినట్లు చాలా స్పష్టంగా చూడవచ్చు.
అంతేకాకుండా ఈ ఈ వీడియోలో మైఖేల్ క్లార్క్ చొక్కా లేకుండా కనిపించడం కొసమెరుపు.కాగా ఈ వీడియోలో తనపై వచ్చిన ఆరోపణలను మాత్రం మైఖేల్ క్లార్క్ ఖండిస్తున్నాడు.

క్లార్ తన గర్ల్ ఫ్రెండ్ జాడే ముందు తన కూతురిపై ప్రమాణం చేయడం వీడియోలో వినిపిస్తోంది.క్లార్క్ మాటలకు పట్టించుకోని జాడే.ముందుకు వెళ్లినట్లు మళ్లీ వెనక్కి వచ్చి.చెంపదెబ్బ కొట్టినట్టు స్పష్టంగా కనబడుతోంది.క్లార్క్, జాడే, ఆమె సోదరి జాస్మిన్, ఆమె భర్త కార్ల్ స్టెఫానోవిక్‌తో ట్రిప్‌కు వెళ్లినట్లు ఇందులో సుస్పష్టం అవుతోంది.

నలుగురు కలిసి రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఈ వివాదం చోటు చేసుకోగా ఈ తంతు జరిగినట్టు, పక్కన వున్నవారు ఎవరో ఈ వీడియో తీసినట్టు కనబడుతోంది.వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.జాడే యార్‌బ్రో పోలీసులకు ఫిర్యాదు చేసింది.క్వీన్స్‌లాండ్ పోలీసులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.30 ఏళ్ల మహిళ, 41 ఏళ్ల వ్యక్తి మధ్య జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.







