రెజ్లింగ్ బెల్టుతో ఫోటోలకు ఫోజులిచ్చిన మంచు లక్ష్మి.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ పై తరచూ ఏదో రకమైన ట్రోల్స్ జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే.

మంచు ఫ్యామిలీలో తరచూ ఎవరూ ఒకరు ట్రోలింగ్స్ బారిన పడుతూనే ఉన్నారు.

మంచి కుటుంబంలో ఎక్కువగా ట్రోల్స్ ని ఎదుర్కొనే వారిలో మంచు లక్ష్మి ముందుగా ఉంటుంది అని చెప్పవచ్చు.ఈమె తన మాటల విషయంలో అలాగే, సినిమాల విషయంలో ట్వీట్ల విషయంలో వైరల్ అవుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది.

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్విట్ చేసే మంచు లక్ష్మి తాజాగా కూడా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది.కాగా ఆ ట్వీట్ లో ఒరిజినల్ రెజ్లింగ్ బెల్ట్ ఒకటి ధరించిన ఫోటోలను షేర్ చేసింది మంచు లక్ష్మి.

నా మిషన్ కేవలం మనుగడ సాధించడమే కాదు, అభివృద్ధి చెందడం, అలా చేయడానికి కొంత అభిరుచి, కొంత కరుణ, కొంత హాస్యం, కొంత స్టైల్ కలిగి ఉండాలి అని ప్రముఖ అమెరికన్ రచయిత్రి మాయ ఏంజెలౌ సూక్తిని ట్వీట్ లో రాసుకొచ్చారు మంచు లక్ష్మి.అంతేకాదు ఒరిజినల్ డబ్ల్యూడబ్ల్యూఈ బెల్ట్ ధరించి విత్ ఒరిజినల్ బెల్ట్ అని రాసుకొచ్చింది.

Advertisement

కాగా తన ట్వీట్ ద్వారా మహిళా సాధికారికత గురించి సూటిగా సుత్తిలేకుండా చెప్పాలనుకున్నది తెలిపింది మంచు లక్ష్మి.మహిళలు స్ట్రాంగ్ గా ఉండాలని, మనుగడ సాధించడం మాత్రమే కాదు మహిళలు అభివృద్ధి చెందాలి అనే విషయాన్ని చెప్పారు.

మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి అన్న విషయాన్ని ఆమె ఈ పోస్ట్ తో చెప్పుకొచ్చారు.

ఇంస్టాగ్రామ్ ఖాతాలో కూడా ఇలానే పోస్ట్ చేశారు.అయితే మంచు లక్ష్మి చేసిన ట్వీట్ పై కొందరు పాజిటివ్ గా స్పందిచగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తూ ఎప్పటిలాగే ఆమెపై ట్రోలింగ్స్ చేస్తున్నారు.ఇంకొందరు అభిమానులు అయితే మేడం మీరు అందులో పాల్గొంటున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి ఈ ట్వీట్ తో మరొకసారి సోషల్ మీడియాలో మంచు లక్ష్మి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.కాగా మంచు లక్ష్మి రెజ్లింగ్ బెల్ట్ పట్టుకుని దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు