సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది నటులలో మంచు లక్ష్మి( Manchu Lakshmi ) ఒకరు.ఈమె సినిమాల్లో నటించి మంచి విజయాలను కూడా అందుకుంది.
అయితే మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి తన మొదటి సినిమా అయిన అనగనగా ఒక ధీరుడు సినిమా( Anaganaga Oka Dheerudu )లో తనదైన నటన ప్రతిభని చూపించి అందరినీ ఆకట్టుకుంది.ఆ తర్వాత వరుసగా ఆమె సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే మంచు లక్ష్మి చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి.నటి గా తను సక్సెస్ అయినప్పటికీ తను చేసిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో సినిమాలకి కొద్ది రోజులు గా దూరంగా ఉంటూ వస్తుంది.

ఇప్పుడు ఆమె సినిమాలో నటించకుండా ఖాళీగానే ఉంటుంది.ఇక ఇలాంటి క్రమంలో మంచు ఫ్యామిలీ( Manchu Family ) నుంచి వచ్చిన ముగ్గురు వారసులు కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మోహన్ బాబు వీళ్ళ కెరియర్ పట్ల చాలా డిప్రెషన్ కి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ ముగ్గురిలో ఎవరైనా ఒక్కరు సక్సెస్ అయిన కూడా మోహన్ బాబు( Mohan Babu ) కొంతవరకు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు.ఇక ప్రస్తుతం మోహన్ బాబు కూడా సినిమాలు లేకుండా ఖాళీగానే ఉంటున్నాడు… ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఒక న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా( Devara Movie )లో ఎన్టీఆర్ అక్క క్యారెక్టర్ కి మంచు లక్ష్మి ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఆ క్యారెక్టర్ చాలా కీలకమైంది కావడంతో మంచు లక్ష్మిని తీసుకోవాలని మేకర్స్ భావించి తనని ఆ సినిమాలో చేర్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక సినిమాలో నిజంగానే మంచు లక్ష్మి నటించినట్లయితే ఆమెకు వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి…
.







