వర్కౌట్ లతో కష్టపడుతున్న మంచు లక్ష్మి.. ఆ పిలుపుతో దారుణంగా ట్రోల్స్?

ఈ మధ్య చాలామంది వర్కౌట్లు చేస్తూ మంచి ఫిజిక్ ను సొంతం చేసుకుంటున్నారు.లేటు వయసులో ఉన్న వాళ్ళు కూడా వయసులో ఉన్న వారిలాగా మారటానికి బాగా కష్టపడుతున్నారు.

 Manchu Lakshmi Is Struggling With Workouts Trolls Badly With That Call, Manchu-TeluguStop.com

ఇప్పటికే లేటు వయసులో ఉన్న సెలెబ్రెటీలు బాగా వర్క్ అవుట్ లు చేసి మునిపటి ఫిజిక్ ను సంపాదించుకున్నారు.అయితే లేటు వయసులో ఉన్నవారు వయసులో ఉన్న వారిలాగా మారినప్పటికీ కూడా ట్రోల్స్ మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి.

తాజాగా అటువంటిదే మంచు లక్ష్మి కి కూడా ఎదురయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న మంచు లక్ష్మి.

నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టి ఇండస్ట్రీలో కొనసాగుతుంది.స్టార్ హీరో మోహన్ బాబు కూతురైన ఈమెకు టాలీవుడ్ లో మంచి గౌరవం ఉంది.

మంచు ఫ్యామిలీ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీకి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టింది.అలా పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

అయితే నటిగా రాను రాను అవకాశాలు తగ్గటంతో నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఈమె తొలిసారిగా ఇంగ్లీష్ సినిమాతో పరిచయం అయింది.ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది.

ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది.

హిందీలో కూడా ఓ సినిమాలో నటించింది.కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.ఇక టాలీవుడ్ బుల్లితెరపై పలు షో లల్లో వ్యాఖ్యాతగా చేసింది.

ఇక ఈ మధ్య ఆహా లో కూడా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం ను కూడా ప్రారంభించింది.

ఇందులో తను హోస్టింగ్ చేస్తూ సెలబ్రెటీలతో వంటలు చేయిస్తుంది.ఇక ఈ మధ్య బాగా వర్కౌట్ లపై బాగా శ్రద్ధ పెట్టింది.పైగా ఆసనాలు కూడా చేస్తుంది మంచు లక్ష్మి.

వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చట్లు పెడుతుంది.

ఇక తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన కూతురు కి సంబంధించిన విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.అలా తన ఫ్యామిలీ గురించే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి కూడా పంచుకుంటుంది.అప్పుడప్పుడు లక్ష్మీ బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది.చాలావరకు ఆమె ఈ వయసులో చేసే గ్లామర్ షో వల్ల  బాగా ట్రోల్స్ ఎదురుకుంటుంది.

కానీ వాటిని అసలు పట్టించుకోదు లక్ష్మి.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె జిమ్ములో వర్కౌట్లు చేస్తున్న వీడియో పంచుకుంది.అందులో తను రకరకాల వర్కౌట్లు చేస్తున్నట్లు కనిపించింది.

ఆ వీడియోను తన ఇన్స్టా వేదికగా పంచుకోగా ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.దీంతో ఆ వీడియో చూసిన తన అభిమానులు తన ఎనర్జీ కి లైక్ కొట్టగా కొందరు మాత్రం బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఓ నెటిజన్.అమ్మమ్మ అని పిలిచి మీరు ఎప్పటికీ పడుచు పిల్ల కాలేరు అంటూ కామెంట్ పెట్టగా.

వెంటనే లక్ష్మీ అభిమానులు ఆ నెటిజన్ పై ఫైర్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube