చామంతి పూలలో ఎరువుల యాజమాన్యం.. అధిక దిగుబడి కోసం మెళుకువలు ..!

చామంతి పూలను వివిధ రకాల పూజలలో, పండగలలో, శుభకార్యాలలో అలంకరణ కోసం ఇంకా బోకేల తయారీలో ఉపయోగిస్తూ ఉండడంవల్ల మార్కెట్లో చామంతి పూలకు మంచి గిరాకీ ఉంటుంది.

చామంతిని శీతాకాలపు పంటగా చెప్పుకోవచ్చు.

చామంతిలో చాలా రకాలు ఉన్నాయి.మన తెలుగు రాష్ట్రాలలో తెలుపు, పసుపు మరియు ఎరుపు రంగు చామంతి పూలు( Chamomile flowers ) సాగులో ఉన్నాయిచామంతి పూల సాగుకు ఒండ్రు మరియు ఎర్ర గరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.

నేల యొక్క పీహెచ్ విలువ 6 నుండి 7 మధ్యన ఉంటే అధిక దిగుబడి పొందవచ్చు.జూన్ నుండి ఆగస్టు వరకు చామంతి పూల సాగు చేపట్టడానికి అనుకూల సమయం.

పండగల సీజన్ కు పూలు చేతికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని చామంతి పూల సాగు చేయాలి.

Advertisement

ఒక ఎకరాలో దాదాపుగా 45 వేల మొక్కలు విత్తుకొని సాగు చేయవచ్చు.మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 50 సెంటీమీటర్ల దూరం ఉంటే సూర్యరశ్మి, గాలి బాగా తగిలి మొక్క ఆరోగ్యకరంగా పెరుగుతుంది.ఎరువుల( Fertilizers ) విషయానికి వస్తే.

మొక్కలు నాటడానికి ముందే నేలలో 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 50 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 50 కిలోల పోటాష్ ఇచ్చే ఎరువులు వేసుకోవాలి.మొక్కల ఎదుగుదల దశలో ప్రతి 20 రోజులకు ఒకసారి సూక్ష్మ పోషక మిశ్రమాలను స్ప్రే చేస్తే దిగుబడి పెరుగుతుంది.

నేలలోని తేమశాతాన్ని బట్టి వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే నీటి తడిని అందించాలి.నారు నాటిన నాలుగు వారాల తర్వాత చామంతి మొక్కల తలలు తుంచి వేయాలి.ఇలా చేస్తే ఒక్కొక్క ముక్క నుండి దాదాపుగా 30 పూలు( Flowers ) పొందవచ్చు.

ఒక ఎకరం పొలంలో సాగు చేస్తే, పెట్టుబడి తీసేసి దాదాపుగా రెండు లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.

గుహలో నిజంగానే 188 ఏళ్ల వ్యక్తిని రక్షించారా.? నిజమెంత?
Advertisement

తాజా వార్తలు