లగ్జరీ వాచ్ శ్రీనగర్ నివాసికి అమ్మాడు.. రిటర్న్ గిఫ్ట్‌గా ఏం పొందాడో తెలిస్తే..

బంగారు రుణాలు అందించే సంస్థ అయిన ఇండియాగోల్డ్ సహ వ్యవస్థాపకుడు దీపక్ అబోట్( Deepak Abbott ) ఇటీవల తన గార్మిన్ ఫెనిక్స్ 7x సోలార్ సఫైర్ వాచ్‌ని( Garmin Fenix 7x Solar Sapphire ) విక్రయించాలనుకున్నాడు, ఇది ఫిట్‌నెస్, ఆరోగ్యాన్ని ట్రాక్ చేయగల స్మార్ట్‌వాచ్.

అతను డిసెంబర్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌లో వాచ్ అమ్ముతున్నట్లు ఓ ప్రకటనను పోస్ట్ చేశాడు.

తన వాచీని తక్కువ ధరకు కొనేందుకు ఎవరైనా ఆసక్తి చూపుతున్నారా అని అడిగాడు.తన వాచ్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశాడు.

అయితే తాజాగా కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు( Srinagar ) చెందిన ఓ అపరిచిత వ్యక్తి దీపక్‌ని సంప్రదించి వాచ్‌ని కొనుగోలు చేశాడు.దీపక్ నివసించే ప్రాంతానికి శ్రీనగర్ చాలా దూరంలో ఉంది.దీపక్ వాచీని అపరిచితుడికి మెయిల్ ద్వారా పంపాడు.

అపరిచితుడు వాచ్‌ చూసి చాలా సంతోషించాడు.దీపక్‌కి కృతజ్ఞతగా బహుమతి పంపాలని నిర్ణయించుకుని దీపక్‌కి కశ్మీరీ వాల్‌నట్లు, పెద్ద రాజ్మా ప్యాకెట్‌ను మెయిల్ చేశాడు.

Advertisement

రాజ్మా( Rajma ) అనేది ఎర్రటి కిడ్నీ బీన్స్‌తో చేసిన వంటకం.కశ్మీరీ వాల్‌నట్‌లు,( Kashmiri Walnuts ) రాజ్మా వాటి నాణ్యత, రుచికి ప్రసిద్ధి చెందాయి.

ఎలాంటి పరిచయం లేకపోయినా తనకు బహుమతిగా నాణ్యమైన ఆహారాలు పంపించడం చూసి దీపక్ ఆశ్చర్యపోయాడు,.తన గడియారాన్ని అమ్మినందుకు అతను ప్రతిఫలంగా ఏమీ ఆశించలేదు.జనవరి 9న ఎక్స్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను పోస్ట్ చేసి.

తన వాచ్‌ను శ్రీనగర్‌లో ఒకరికి విక్రయించినట్లు చెప్పాడు.ఇది తనకు తెలియని వారితో కుదిరిన వ్యాపార ఒప్పందమని అన్నారు.

కానీ కొనుగోలుదారుడు నుంచి వాల్‌నట్స్, రాజ్మా బహుమతిగా అందుకున్నానని చెప్పాడు.సదరు కొనుగోలుదారుడు చూపిన ఈ చర్య పట్ల తాను కదిలిపోయానని అన్నాడు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)

ఎక్స్‌లో దీపక్ పోస్ట్‌ వేల కొద్ది వ్యూస్‌తో వైరల్‌గా మారింది.చాలామంది ఇది చూసి ఆ కొనుగోలుదారుడు చాలా మంచోడు అని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు