సాధారణంగా కొందరు మనుషులు జంతువులను హింస పెడుతూ వాటిని ఎంతో బాధిస్తుంటారు.వేరే వాళ్ళు చెప్పినా పట్టించుకోకుండా వీరు దారుణంగా ప్రవర్తిస్తుంటారు.
కాగా తాజాగా ఒక వ్యక్తి ఫోన్ పట్టుకొని పులి వెనుక పరిగెత్తాడు.అలా దానిని భయపెడుతూ ఇబ్బంది పెడుతూ అందరి ఆగ్రహానికి గురవుతున్నాడు.
ఈ ఘటన ఒక నేషనల్ పార్క్‌లో వెలుగు చూసింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్‌తో టైగర్‌ను వెంటాడటం కనిపించింది.
ఈ వైరల్ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.8 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్‌లో జంగిల్ సఫారీ చేస్తున్న వ్యక్తులలో ఒక వ్యక్తి చేతిలో ఫోన్ పట్టుకుని టైగర్ వెంటపడటం మీరు చూడవచ్చు.జీప్ నుంచి దిగిన మరికొందరు టూరిస్టులు టైగర్‌ను తమ మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేయడం కూడా గమనించవచ్చు.
అయితే ఇలాంటి పిచ్చి పనిపై సుశాంత నంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.టైగర్ టూరిజం స్థానికులకు జీవనోపాధిని కల్పిస్తోందని,
వన్యప్రాణుల సంరక్షణకు సహకరిస్తుందని కానీ ఇలాంటి కొందరి మూర్ఖత్వపు పనుల వల్ల దానికి చెడ్డపేరు వస్తుందన్నారు.పర్యటకులు ఇలాంటి పనులకు దూరంగా ఉండాలని, వైల్డ్‌లైఫ్ సఫారీల్లో వెళ్తున్నప్పుడు బుద్ధిగా వ్యవహరించాలని పేర్కొన్నారు.ఈ వీడియోను షేర్ చేసిన సమయాన్ని నుంచి ఇప్పటివరకు 20వేల వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియో పై చాలా మంది రియాక్ట్ అవుతూ ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.శిక్షిస్తేనే వారికి బుద్ధి వస్తుందని పేర్కొంటున్నారు.