ఏపీ మంత్రి రోజాపై జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు ఎంటో తెలుసుకో అని చెప్పారు.
పర్యాటక శాఖ మంత్రి అంటే మీరు పర్యటనలు చేయడం కాదు.పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలని సూచించారు.
చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని పేర్కొన్నారు.రోజా నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదని విమర్శించారు.
పర్యాటక శాఖ ర్యాంకింగ్స్ లో ఏపీ 18వ స్థానంలో ఉందని తెలిపారు.మంత్రిగా బాధ్యతలు మరిచిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడితే రోజా పదవి దిగిపోయేలాగా 20వ స్థానానికి తీసుకెళ్తారని హెచ్చరించారు.







