బ్యాడ్‌లక్‌ : లక్ష డాలర్ల లాటరీ తలిగిందని ఫోన్‌ చేస్తే జోక్‌ చేయకని కాల్‌ కట్‌ చేశాడు, ఆ తర్వాత ఏమైందంటే..!

అదృష్టదేవత వచ్చి తలుపు తడితే బిజీగా ఉన్నాను తర్వాత రమ్మని అనేవారు కొందరు ఉంటారు.

అలాంటి వారిని ప్రపంచంలోనే అత్యంత మూర్ఖులు అని, దురదృష్టవంతులు అని అనవచ్చు.

అంతటి దురదృష్టవంతులకు మళ్లీ అదృష్టం అనేది దక్కుతుందో లేదో తెలియదు.వచ్చిన అవకాశం మళ్లీ మిస్‌ అయితే జీవితంలో ఆ అవకాశం రాకపోవచ్చు.

అమెరికాలో తాజాగా అలాంటి పరిణామం ఒకటి జరిగింది.న్యూయార్క్‌లోని ఒక వ్యక్తికి లక్కీ డ్రాలో లక్ష డాలర్ల లాటరీ తలిగింది.

అయితే అతడు దురదృష్టంతో దాన్ని కోల్పోయాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

Advertisement

న్యూయార్క్‌కు చెందిన జాక్‌ ఎల్విన్‌ అనే 40 ఏళ్ల వ్యక్తి కొన్ని నెలల క్రితం ఒక మాల్‌ లో షాపింగ్‌ చేశాడు.ఆ సమయంలో అక్కడ కస్టమర్ల వివరాలు సేకరిస్తున్నారు.

తమ మాల్‌లో షాపింగ్‌ చేసిన వారిలోంచి ఒకరిని ఎంపిక చేసి లక్ష డాలర్ల ప్రైజ్‌ మనీ ఇవ్వబోతున్నట్లుగా అప్పుడు వారు ప్రకటించారు.జాక్‌ కూడా అక్కడ షాపింగ్‌ చేసి, తన వివరాలు ఇచ్చాడు.

అయితే కొన్ని రోజులకు ఆ విషయం మర్చి పోయాడు.అసలు ఇలాంటివి అన్ని కూడా ఫేక్‌ అనేది అతడి అభిప్రాయం.

అయితే లక్కీగా జాక్‌కు ఆ మాల్‌ డ్రాలో లక్ష డాలర్లు తగిలాయి.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

షాపింగ్‌ మాల్‌ నుండి కాల్‌ వచ్చింది, కాల్‌ రిసీవ్‌ చేసుకున్న జాక్‌ మీరు లక్ష డాలర్ల రూపాయలు గెల్చుకున్నారు అంటూ అవతలి నుండి ఒక మహిళ చెప్పింది.అయితే జోక్‌ చేయమాకు ఇక చాలు అంటూ ఫోన్‌ పెట్టేశాడు.ఆ సమయంలో జాక్‌ ఆఫీస్‌ పనిలో బిజీగా ఉండటం వల్ల ఆ ఫోన్‌ గురించి ఆలోచించలేక పోయాడు.

Advertisement

మరోసారి కాల్‌ చేసిన సమయంలో నిజంగానే మీకు లక్కీ డ్రా తగిలిందని చెప్పినా కూడా నాకు వద్దు, మరెవ్వరికైనా ఇవ్వండి అంటూ జాక్‌ చెప్పాడు.దాంతో మరోసారి డ్రా తీసి మరో వ్యక్తిని ఎంపిక చేయడం జరిగింది.

ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత విషయం గురించి అతడు విన్నాడు.ఆ మాల్‌కు వెళ్లి ఎంక్వౌరీ చేసిన సమయంలో తనకు డ్రా తలిగిన విషయం నిజమే అని తెలుసుకున్నాడు.

అప్పటికే లక్ష డాలర్లు మరో వ్యక్తికి ఇచ్చేశారు.దాంతో జాక్‌ లబోదిబోమన్నాడు.

తన బ్యాడ్‌లక్‌కు కుమిలి కుమిలి ఏడ్చాడు.

తాజా వార్తలు