జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.జంతువులు ఒకదానిపై ఒకటి దాడి చేసుకోవడం లేదా మనుషులపై దాడి చేసే సంఘటనలకు సంబంధించిన దృశ్యాలు బాగా నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి.
వీటిల్లో కొండచిలువల( Python ) వీడియోలు ఎక్కువగా ఉంటాయి.కొండచిలువలు మనిషిపై దాడి చేసి తినేయడం లేదా మనుషులు కొండచిలువను పట్టుకోవడం లాంటి వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది.
ఈ వీడియోలో 19 అడుగుల పొడవు గల ఓ కొండచిలువను యువకుడు పట్టుకున్నాడు.అమెరికాలో( America ) ఈ ఘటన చోటుచేసుకుంది.ఫ్లోరిడాలోని ఓహియో యూనివర్సిటీకి చెందిన 22 ఏళ్ల యువకుడు సాహసం చేశాడు.ఏకంగా 56.6 కేజీల బరువు గల కొండచిలువను పట్టుకున్నాడు.యువకుడు రోడ్డుపై వెళుతుండగా ఈ భారీ కొండ చిలువ కనిపించింది.కొంతమంది యువకులు కలిసి వెళుతుండగా ఈ పెద్ద కొండచిలువ ఎదురుగా వచ్చింది.దీంతో భయంతో కొంతమంది యువకులు పరుగులు పెట్టారు.అయితే ఒక యువకుడు మాత్రం ధైర్యం చేశాడు.
కొండచిలువను పట్టుకునేందుకు చాలాసేపు ప్రయత్నాలు చేశాడు.
కొండ చిలువను పట్టుకునేందుకు యువకుడు చేస్తున్న ప్రయత్నాలను గమనించి ఇతర యువకులు కూడా సహాయం చేశారు.చివరికి అందరూ కలిసి కొండ చిలువను పట్టుకున్నారు.అనంతరం దీనిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
కొంతమంది దీనిని వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో( Social Media ) పోస్ట్ చేశారు.దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.అలాగే యువకుల ధైర్యసాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు.
కొండ చిలువను పట్టుకుునేందుకు యువకులు పెద్ద యుద్దమే చేశారు.దాని తలను గట్టిగా పట్టుకుని అలాగా ఉండిపోయారు.