డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ( Puri Jagannadh )కెరీర్ ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉంది.ఈ మధ్య కాలంలో ఈయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.
ఇస్మార్ట్ శంకర్ మినహా మిగిలిన అన్ని సినిమా లు కూడా పూరి కి చాలా నిరాశ ను మగిల్చాయి అనే విషయం తెల్సిందే.మొన్న విజయ్ దేవరకొండతో రూపొందించిన లైగర్ సినిమా( Liger Movie ) తీవ్రంగా నిరాశ పరిచింది.
హీరో గా విజయ్ దేవరకొండ సినిమా అని చాలా మంది లైగర్ పై ఆశలు పెట్టుకుంటే తీవ్రంగా నిరాశ పరిచింది.

గతంలో పూరి సినిమా ల్లో మ్యూజిక్ కి మంచి ప్రాముఖ్యత ఉండేది.కానీ లైగర్ సినిమా సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లుగా విమర్శలు వచ్చాయి.సోషల్ మీడియా లో కూడా లైగర్ మ్యూజిక్ కి ట్రోల్స్ వచ్చాయి.
పలువురు సంగీత దర్శకులు లైగర్ కి సంగీతాన్ని అందించారు.అయినా కూడా ఒక్క పాట బాగాలేదు.
దాంతో ఈసారి పూరి రూపొందిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా లో అయినా పాటలు బాగుండే విధంగా చర్యలు తీసుకుంటాడా అంటే ఈసారి కూడా సంగీతాన్ని పూరి లైట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమా కు మణిశర్మ ( Mani Sharma )సంగీతాన్ని అందించాడు.అందులోని పాటలు పాజిటివ్ టాక్ దక్కించుకున్నాయి.రెండు మూడు పాటలు ఇంకా కూడా మోగుతూనే ఉన్నాయి.
అలాంటి మణిశర్మ సంగీతాన్ని వదిలేసి మళ్లీ బాలీవుడ్ కంపోజర్స్ వైపు పరుగులు తీస్తున్నాడు.తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ సంగీత దర్శకుల పాటలు నచ్చవు అని తెలిసి కూడా పూరి ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటున్నాడో అర్థం కావడం లేదు అంటూ నెటిజన్స్ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ విషయమై ప్రధానంగా చర్చ జరుగుతోంది.డబుల్ ఇస్మార్ట్ మూవీ సంగీతాన్ని పూరి లైట్ తీసుకున్న నేపథ్యం లో రామ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సినిమా ను లైట్ తీసుకుంటారేమో అనేది చూసుకుంటే బెటర్.







