ఎన్నికల సంవత్సరంలోకి వచ్చినందున ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి .అధికార వైసిపి( YCP ) పార్టీపై ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం జనసేన పోటీపడి విమర్శలు చేస్తున్నాయి.
తన వారాహి యాత్ర ద్వారా ఇప్పటివరకు జగన్ ని ఏ నేత తిట్టనన్ని తిట్లు పవన్ తిడుతున్నారు.పదవికి కూడా మర్యాద ఇవ్వకుండా జగన్ ను పట్టుకొని క్రిమినల్ అని రౌడీ అని నేరచరిత్రఉందని , అసమర్థ ముఖ్యమంత్రి అని ఇలా అనేక రకాలుగా పవన్ తన వారాహి యాత్ర ద్వారా విమర్శలు పదును పెంచుతున్నారు.అయితే ఇప్పటికి కూడా పవన్ ని తిట్టాలంటే ఆయన సామాజిక వర్గం నేతలతోనే తిట్టిస్తూ సాంప్రదాయకమైన ఎత్తుగడలకే వైసీపీ పరిమితమైంది.2019 ఎన్నికలలో అత్యంత బలంగా కనిపించిన వైసిపి సోషల్ మీడియా కూడా నామ మాత్రపు విమర్శలకు పరిమితం అయిపోయినట్లుగా తెలుస్తుంది.

జనసేన వైపు నుంచి వస్తున్న స్థాయిలో ప్రతిస్పందన వైసిపి సోషల్ మీడియా నుంచి కానీ అధికారపక్ష నేతల నుంచి కానీ కనిపించడం లేదు.చెప్పుకోదగ్గ నలుగురైదుగురు తప్ప 151 ఎమ్మెల్యేల బలం ఉన్న ఒక పార్టీ నుంచి ఏ రేంజ్ లో రిప్లై ఉండాలో దానిలో సగం కూడా ఉండటం లేదని తెలుస్తుంది .మరి జగన్( YS Jagan Mohan Reddy ) పరిపాలనపై నిర్లిప్తం గా ఉన్న మంత్రులు మనకెందుకు వచ్చిన గొడవ అని సైలెంట్ గా ఉంటున్నారా? లేక ప్రతిపక్ష విమర్శలకు చేతల్లో సమాధానం ఇద్దాము అని లైట్ తీసుకుంటున్నారో తెలియదు కానీ వైసీపీ అభిమానులు మాత్రం ఈ జగన్ సైలెన్సును తట్టుకోలేకపోతున్నారని తెలుస్తుంది.

స్వయంగా తాను నిర్మించిన వాలంటీర్ వ్యవస్థ( Volunteer System ) పై సచివాలయ వ్యవస్థ పై పవన్ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసినా కూడా జగన్లో స్పందన లేకపోవడం హార్డ్ కోర్ వైసీపీ అభిమానులు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది చెప్పవచ్చు.సామాజిక సమీకరణము లో భాగంగా కీలక నేతలను పక్కకు పెట్టడం వల్లే కొడాలి నాని, వల్లభనేని వంశీ ,అనిల్ యాదవ్ వంటి నేతలు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారని , ఒకప్పుడు జగన్ పై ఈగ వాలితే సహించలేని ఈ నేతలు ఇప్పుడు మనకెందుకు ఉండిపోయారని వార్తలు వస్తున్నాయి.







