జుగాద్( Jugaad ) యొక్క అనేక ఫన్నీ వీడియోలు ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.ఈ వీడియోలలో కొన్ని చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.తాజాగా, ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అందులో ఒక వ్యక్తి ఇంట్లో తయారుచేసిన జుగాద్ పని ఇప్పుడు వైరల్ అవుతుంది.అతను ఏకంగా హెలికాప్టర్‌ను( Helicopter ) తయారు చేసి, ఆపై దానిని ఆకాశంలో ఎగురవేసాడు.
పొలాల మధ్య ఉన్న రోడ్డుపై ఈ వ్యక్తి తన హెలికాప్టర్‌ను వేగంగా పరిగెత్తడం, ఆపై అతను దానితో గాలిలోకి ఎగరడం వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోను @naughty_nehu అనే వినియోగదారు ఇంస్టాగ్రామ్ లో భాగస్వామ్యం చేసారు.
ఐకే వీడియో వైరల్ కావడంతో వీడియోకు జనాలు ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు.ఈ వీడియోపై చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేశారు.ఒక వ్యక్తి వ్యాఖ్యానిస్తూ.‘చిల్ అవుట్ అబ్బాయిలు, అతను తన స్నేహితురాలి కోసం చాంద్‌ని పికప్ చేయడానికి వెళ్ళాడు’ అని కామెంట్ చేసాడు.ఇప్పటికే ఈ వీడియోకు 3 లక్షల మందికి పైగా దీన్ని లైక్ చేసారు.వేల సంఖ్యలో లైకులు వస్తున్నాయి.ఆకాశంలో వేగంగా దూసుకెళ్తున్న వ్యక్తిని చూసి.‘అన్నయ్యా.ఎప్పుడొస్తావు.దిగిన వీడియోను కూడా పోస్ట్ చేయండి.అప్పుడే నువ్వు వచ్చానన్న తృప్తి కలుగుతుంది’ అంటూ కామెంట్స్ చేసారు సోషల్ మీడియా నెటిజన్స్.
ఏది ఏమైనా కొన్ని జుగాద్ పనులు ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయి.వాటిని చూస్తే మనకు ఎందుకు ఇటువంటి ఆలోచన రాలేదు అని కూడా బాధపడతాము.ప్రస్తుతం ఈ జుగాద్ హెలికాప్టర్( Jugaad Helicopter ) మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఇంకెందుకు అలసయం ఈ వైరల్ వీడియో ను మీరు కూడా చూసేయండి.