కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ డ్రామా చిత్రం “దేవర: పార్ట్ 1”. దీన్ని యువసుధ ఆర్ట్స్, N.
T.R.ఆర్ట్స్ కలిసి నిర్మించాయి.ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
సైఫ్ అలీ ఖాన్ ఇందులో ఒక ముఖ్యమైన రోల్ పోషించాడు.ఈ సినిమాతో బ్యూటిఫుల్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం కానుంది.
అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు.
ఈనెల 27వ తేదీన రిలీజ్ కానున్న ఈ మూవీ స్టోరీ తెలుసుకుంటే.
ఒక సముద్ర తీర ప్రాంతంలో జరిగే ఓ గొప్ప యాక్షన్ సినిమా ఇది.ఇందులో హీరో దేవర( Devara ) ధైర్యవంతుడు.తన ప్రజలను రక్షించడానికి ప్రమాదకరమైన సముద్ర ప్రపంచంలోకి ప్రయాణిస్తాడు.తన సోదరుడు భైరవు చేస్తున్న కుట్ర గురించి తెలియక, తన మృదువైన స్వభావం ఉన్న కుమారుడు వరదకు తన ఆస్తిని అప్పగిస్తాడు.
స్టోరీ వింటుంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది కదూ.కానీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటే ముందు మూడు బిగ్గెస్ట్ ఛాలెంజ్‌లను ఓవర్‌కమ్ చేయాలి.ఆ సవాళ్లు ఏవో తెలుసుకుందాం.
• రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్
రాజమౌళితో( Rajamouli ) సినిమా చేసిన తర్వాత ఏ హీరో అయినా సరే నెక్స్ట్ ఫ్లాప్ అందుకోవాల్సిందే.ఉదాహరణకి ప్రభాస్, చరణ్‌లను తీసుకోవచ్చు.చరణ్ మగధీర తర్వాత ఆరెంజ్ లాంటి అతి పెద్ద డిజాస్టర్ అందుకున్నాడు.
ఇక ప్రభాస్ బాహుబలి పార్ట్-1, పార్ట్-2 తర్వాత బ్యాక్-టు-బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేశాడు.ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అలాంటి ఫ్లాప్ అందుకుంటాడా? అనేది ఆందోళనకరంగా మారింది.ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతూనే ఉంది.దేవర సినిమాకు ఇదే పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు.ఒకవేళ ఈ మూవీ హిట్టైతే రాజమౌళితో సినిమా చేశాక నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్‌కి చెక్ పెట్టినట్లు అవుతుంది.
• కొరటాల శివ
కొరటాల శివ( Koratala Siva ) ఇటీవల తీసిన ఆచార్య సినిమా( Acharya Movie ) బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.దీనివల్ల అతని ప్రతిభపై అనుమానాలు మొదలయ్యాయి.ఈ ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా తీయడమే చాలా రిస్క్.
అది కూడా ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సక్సెస్ తర్వాత తీయడం ఇంకా పెద్ద రిస్క్.కొరటాల శివ ఈ సినిమాతో తన సత్తా చాటాల్సి ఉంటుంది ఆయన ఏ మాత్రం తప్పు చేసినా ఎన్టీఆర్ డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది.
• అనిరుధ్ రవిచందర్
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్( Anirudh Ravichander ) అజ్ఞాతవాసి సినిమాలో వరస్ట్ మ్యూజిక్ అందించి ఫుల్ డిసప్పాయింట్ చేశాడు.నిజం చెప్పాలంటే మ్యూజిక్ ఒక్కటే బాగున్నా సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.మ్యూజిక్ బాగా లేకపోతే స్టోరీ బాగున్నా సినిమా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ.అనిరుధ్ చేతిలో కూడా ఈ మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.