ఫ్రిడ్జ్ దగ్గరకెళ్లగానే ఊహించని షాక్.. బుసలు కొడుతూ దర్శనమిచ్చిన పాము

చాలా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే, చాలా మందికి భయం పుడుతుంది.అకస్మాత్తుగా జరిగే అలాంటి వాటికి పలువురికి గుండె ఆగినంత పనవుతుంది.

 Man Find Giant Snake Hiding Behind Fridge Details, Fridge, Snake, Viral Latest,-TeluguStop.com

ఓ వ్యక్తి విషయంలో కూడా అలాంటిదే జరిగింది.ఓ వ్యక్తి తన ఇంట్లో ఫ్రిడ్జ్ వద్దకు వెళ్లాడు.

దానిలో నుంచి ఏదో తీసుకునే లోపే వింత వింత శబ్దాలు రావడం గమనించాడు.తొలుత అవి ఎటువైపు నుంచి వస్తున్నాయో అర్ధం కాలేదు.

తీరా ఫ్రిడ్జ్ వెనుక భాగంలో చూడగానే అతడికి కళ్లు బైర్లు కమ్మాయి.ఉన్నపళంగా వెనక్కి పరుగులు పెట్టాడు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

వర్షాకాలంలో తలదాచుకునేందుకు వెచ్చని ప్రదేశాలను పాములు, తేళ్లు వంటివి వెతుక్కుంటాయి.ముఖ్యంగా గ్రామాల్లో పొలాలకు సమీపంలో ఉండే ఇళ్లల్లోకి పాములు తరచూ వస్తుంటాయి.ఇలాంటివి చూసినప్పుడు అంతా భయపడుతుంటారు.

చిన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడుతుంటారు.ఏదైనా పాము వస్తే వెంటనే అప్రమత్తమై దానిని చంపడమో లేక స్నేక్ క్యాచర్లను పిలిచి వాటిని పట్టుకోవడమో చేస్తుంటారు.

అమెరికాలో ఇదే తరహాలో వింత అనుభవం ఓ వ్యక్తికి ఎదురైంది.ఓ వ్యక్తి ఫ్రిడ్జ్ వెనుక భాగంలో వింత వింత శబ్దాలు రావడం చూశాడు.ఫ్రిడ్జ్ వెనుక భాగంలో పరిశీలించగా అక్కడ ఐదడుగుల పాము కనిపించింది.వెంటనే ఆ వ్యక్తి స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు.అతడు దానిని పట్టుకుని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాముల పట్ల అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube