తన కోరిక తీర్చకపోతే ఫోటోలు నెట్ లో పెడతానని బెదిరిస్తున్న ప్రియుడు.. చివరకు..

ఈ మధ్య కొందరు మగవాళ్ళు మృగాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు.అమ్మాయిలను సోషల్ మీడియాలో పరిచయం చేసుకోవడం తర్వాత మాయమాటలు చెప్పి వారిని ప్రేమలోకి దింపుతారు.

కొన్నిరోజులు ప్రేమిస్తున్నట్లు నటించి వారితో క్లోజ్ గా ఫోటోలు దిగి వాటిని ఆయుధంగా మలుచుకుని అమ్మాయిలతో ఆడుకుంటున్నారు.తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

ఒక యువకుడు సోషల్ మీడియాలో పరిచయమైన ఒక యువతితో కొన్నాళ్ళు ప్రేమాయణం సాగించాడు.అయితే కొన్నాళ్ళు వీరి ప్రేమాయణం బాగానే సాగినా తర్వాత ఆ యువకుడు ఆ అమ్మాయికి బ్రేక్ అప్ చెప్పాడు.

తర్వాతే అసలు కథ మొదలయ్యింది.ఆ అమ్మాయిని నా కోరిక తీర్చకపోతే నీ ఫోటోలు, వీడియోలు నెట్ లో పెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు.

Advertisement

పూర్తి వివరాల్లోకి వెళ్తే.తమిళనాడులోని పుదుచ్చేరి లో కార్తీ అనే యువకుడు నివసిస్తుండేవాడు.

ఆ యువకుడు జులాయిగా తిరుగుతుండేవాడు.అయితే అతడి ఫ్రెండ్ వాట్సాప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసాడు.

అందులో కార్తీ ని కూడా చేర్చాడు.అదే గ్రూప్ లో ఉండే ఒక యువతితో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తర్వాత ఇద్దరు కలిసి చట్టాపట్టాలేసుకుని తిరిగారు.వెళ్లిన ప్రతి ప్రదేశంలో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.కట్ చేస్తే ఏమయ్యిందో ఏమో తెలియదు కానీ కార్తీ ఆ యువతికి బ్రేక్ అప్ చెప్పేసాడు.

Advertisement

ఇద్దరు విడిపోయారు.అయితే కొన్నిరోజులు కార్తీ ఆ యువతి జోలికి వెళ్ళలేదు.

తర్వాత ఒక రోజు ఫోన్ చేసి తన కోరిక తీర్చమని అడగడంతో ఆ యువతి ఒక్కసారిగా షాక్ అయ్యింది.అందుకు ఆ యువతి నో చెప్పడంతో కార్తీ తను దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఆ యువతిని భయపెట్టాడు.

ఆమె వద్ద నుండి 15000 రూపాయలు తీసుకున్నాడు.తర్వాత కొద్దిరోజులకు మళ్ళీ ఫోన్ చేసి డబ్బులివ్వాలని బెదిరించడంతో ఆ యువతి మళ్ళీ 5000 రూపాయలు ఇచ్చింది.అయితే ఇంతటితో ఆగకుండా ఆ యువతిని బెదిరిస్తూనే ఉన్నాడు.

ఒక రోజు ఫోన్ చేసి మళ్ళీ తన కోరిక తీర్చాలని అంతేకాదు దానితోపాటు 50000 రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసాడు.లేకపోతే మనిద్దరం కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు మీ తల్లిదండ్రులకు, మీ చెల్లికి పంపుతానని చెప్పడంతో ఇంకా ఇదంతా భరించలేక ఆ యువతి జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

తాజా వార్తలు