కిలో ఉల్లి కోసం ప్రాణం పోగొట్టుకున్న వ్యక్తి

ప్రస్తుతం ఉల్లి ధరలు పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా ఉల్లి కోసం ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు.

అయితే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉల్లిని సబ్సిడీ రూపంలో సామాన్యులకు అందించే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ క్రమంలో కిలో ఉల్లి కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన తాజాగా ఏపీలోని గుడివాడలో చోటు చేసుకుంది.ఏపీ ప్రభుత్వం ఉల్లిని ప్రజలకు అందించే క్రమంలో సబ్సిడీ రూపంలో కిలో ఉల్లిని రూ.25కే అందించాలని విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసింది.అయితే ఈ విక్రయ కేంద్రాల వద్ద సరైన నిర్వహణ లేకపోవడంతో తెల్లవారుజాము నుండే ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

కిలోమీటర్ మేర లైన్ ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.కాగా గుడివాడలోని సబ్సిడీ ఉల్లి విక్రయ కేంద్రంలో సాంబయ్య అనే వ్యక్తి ఉదయం నుంచి లైనులో నిల్చున్నాడు.

మంది ఎక్కువగా ఉండటంతో తనకు ఉల్లి దొరుకుతుందో లేదో అని టెన్షన్‌కు గురైన సాంబయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.కాగా అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

ఉల్లి కోసం ఇలా ఓ వ్యక్తి ప్రాణం కోల్పోవడంతో అక్కడి వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.ప్రభుత్వం వెంటనే ఉల్లిని అందుబాటు ధరలోకి తీసుకువచ్చి, అన్ని చోట్లా విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు