అంగాన్ని పెద్దగా చేసే సర్జరీ చేసుకున్నాడు ... ఆ తరువాత దారుణం జరిగింది

మనిషి శరీరం అన్నాక కొన్ని ఆకర్షణీయమైన అంశాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి.అది ఎలా ఉన్నా అది మన శరీరమే.

దాంట్లో లోపాలు ఉన్నా అది మన తప్పు కాదు, దాంట్లో బలహీనతలు ఉన్నా అది మన తప్పు కాదు అలాగే అది అందంగా ఉన్నా, అది మన గొప్ప కాదు.అంతా జీన్స్ వలనేగా జరిగేది.

ఈ ఆలోచన లేకే జనాలు సర్జరీల వెంటపడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.ఈ పిచ్చి స్త్రీలలో ఎక్కువ ఉంది.

హీరోయిన్లు కూడా తమ బాడి షేపులు మార్చుకోవడంతో, వారిని చూసి వీరు కూడా వాత పెట్టుకుంటున్నారు.పెదాలు ఆకృతి మార్చుకోవడం, వక్షోజాల సైజు పెంచుకోవడం .ఇలాంటివి మాత్రమే, ఏకంగా యోని షేపు మార్చుకునే సర్జరీ కూడా అందుబాటులోకి వచ్చింది.వాటి వెంట కూడా పడుతున్నారు.

Advertisement

పురుషులు మహిళలతో పోల్చుకుంటే బెటర్ అయినా, ఈమధ్య పురుషులకి కూడా ఇలాంటి వింత కోరికలు పుడుతున్నాయి.ఒక స్వీడన్ పురుషుడు తన అంగం సైజు పెంచుకోబోయి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ సర్జరీ ఎలా చేసారు అంటే ముందు సస్పెంసరి లిగమెంట్ కట్ చేసారు.అంగం సైజు దీనివలనే ప్రభావితం అవుతుంది కదా.ఇప్పుడు వారికి సాగదీసే అవకాశం దొరికింది.ఆ పని చేసి లిపోసేక్షన్ ద్వారా కొంత కొవ్వుని తీసుకొచ్చి నింపేశారు.

దాంతో అంగం సైజు పెరిగింది, అలాగే మందం కూడా పెరిగింది.కాని దురదృష్టవశాత్తూ ఆ కొవ్వు కాస్త రక్తం పాటు శరీరం మొత్తం ప్రయాణించి కొన్ని రక్తనాళాల్ని బ్లాక్ చేసింది.

ఇంకేముంది, ఊపిరితిత్తులతో పాటు ఇంకొన్ని శరీరం భాగాలలో రక్తప్రసరణ బాగా డిస్టర్బ్ అయ్యింది.ఊపిరితిత్తులపై ఎక్కువ ఎఫెక్ట్ పడటంతో శరీరానికి ఆక్సిజన్ అందడం కష్టమైపోయింది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)

దాంతో కాసేపటికే కన్నుమూశాడు.వయసు ఎక్కువ ఉన్నవాడేమో, అందుకే ఇలా జరిగింది అనుకునేరు.

Advertisement

కేవలం 30 ఏళ్ల వయసు తనది.తన భాగస్వామి తన అంగం సైజు చూసి డిజపాయింట్ అవుతుందేమో, తన జీవితంలోకి రాబోతున్న అమ్మాయిని సరిగా సుఖపెట్టలేనేమో అనే భయంతో ఈ సర్జరీకి వెళ్ళాడు.

వెళుతూ వెళుతూ అటే పైకి వెళ్ళిపోయాడు.ఇలా ప్రమాదాలు తెచ్చుకున్న మగవాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు.

ఇప్పటికే పరిశోధకులు చాలాసార్లు చెప్పారు, సేక్సాలాజిస్ట్లు నొక్కి నొక్కి చెప్పారు, పురుషాంగం సైజు కాదు కావాల్సింది, దాని స్తంభన మాత్రమే అని.కాని కొందరు అంతే.వక్షోజాల సైజు చిన్నగా ఉందని తమని తాము తక్కువ చూసుకునే అమ్మాయిలు ఎలాగో, ఇలాంటి వాళ్ళు కూడా అంతే.

తాజా వార్తలు