వరంగల్ లో దారుణం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి.. !

మనిషికి ప్రాణం అంటే విలువలేదు.

ఒక వ్యక్తి తల్లి గర్భంలో నుండి బయటికి రావాలంటే తొమ్మిది నెలలు ఆగాలి, ఈ లోపల ఆ తల్లికి కలిగే కష్టం అంతా ఇంతా కాదు.

ఇక పురిటి నొప్పులు భరించి బిడ్డకు జన్మను ఇవ్వాలి.ఆ పుట్టిన బిడ్దను కంటికి రెప్పలా కాపాడితేనే పెద్దవాడిగా ఎదిగేది.

Telangana, Man Commits, Suicide, Petrol, Warangal, Warangal Man Commits Suicide

ఇన్ని కష్టాలు ఒక మనిషి జీవితం వెనక దాగి ఉండగా ఏదో ఆవేశంలో జీవితాన్ని చేజేతులారా చిదిమేసుకుంటున్నారు కొందరు.అసలు మనిషి ప్రాణం నల్లికంటే దారుణంగా మారిపోయింది.

ఏమైన బాధ కలిగితే చాలు ఆత్మహత్యలు చేసుకోవడం నేడు లోకంలో సర్వసాధారణం అయ్యింది.ఇకపోతే వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఒక దారుణం చోటుచేసుకుంది.

Advertisement

శరీరం నిండా పెట్రోల్ పోసుకుని, ఒంటికి నిప్పటించుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.మంటలు శరీరం అంతా వ్యాపించగానే బాధితుడు కిందపడి కేకలు పెట్టాడు.

కాగా ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.ఇకపోతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి అబ్బానికుంటకు చెందిన హరికృష్ణగా గుర్తించారు.

కాగా, ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వామ్మో.. బన్నీకి జోడీగా అంతమంది హీరోయిన్లా.. కొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నారా?
Advertisement

తాజా వార్తలు