ఇదేం ఆనందాంరా బాబు.. విడాకులు వచ్చాయని ఏకంగా?

ఇప్పుడు చిన్నచిన్న కారణాలతోనే దంపతులు విడిపోవడం సాధారణమైపోయింది.కొందరు భార్యాభర్తలు సులభమైన వివాదాల కారణంగానే విడాకులు( Divorce ) తీసుకుంటున్నారు.

కానీ విడాకుల అనంతరం చాలా మందికి ఆనందం కంటే మానసిక వేదన, ఒంటరితనం, బాధలు ఎక్కువగా ఉంటాయి.అయితే, కొందరు మాత్రమే విడాకుల తర్వాత సంతోషంగా జీవించగలుగుతారు.

విడాకుల సందర్భాన్ని స్నేహితులతో కలిసి పార్టీలు( Party ) నిర్వహించుకున్నవారిని మనం చూశే ఉంటాం.ఈ నేపథ్యంలో, ఓ వ్యక్తి తన భార్య నుంచి విడిపోవడం పెద్ద విజయంగా భావించి విడాకుల పార్టీ నిర్వహించాడు.

ప్రత్యేకంగా తన మాజీ భార్యను( Ex-Wife ) పోలిన విగ్రహాన్ని తయారుచేసి, ఆ విగ్రహం చుట్టూ స్నేహితులతో కలిసి ఆ పార్టీ జరుపుకున్నాడు.ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Advertisement

విడాకులు తీసుకున్న ఓ వ్యక్తి సంబరాలు జరుపుకున్న ఈ విచిత్ర ఘటన హర్యానాలో( Haryana ) చోటుచేసుకుంది.2020లో కోమల్‌ను మంజీత్ వివాహం చేసుకున్నాడు.అయితే కొద్ది రోజుల్లోనే వారి వైవాహిక జీవితంలో మనస్పర్థలువచ్చాయి.

అది చివరకు విడాకుల వరకు చేరింది.మంజీత్,( Manjeeth ) 2024 ఆగస్టు 1న తన భార్యతో విడిపోయాడు.

తాజాగా, ఈ విషయాన్ని గ్రాండ్‌గా జరుపుకోవడానికి విడాకుల పార్టీ ఏర్పాటు చేసి సంబరాలు చేసుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది.

ఆ వీడియోలో మంజీత్ తన మాజీ భార్యను పోలి రూపొందించిన ఆడ బొమ్మ భుజంపై చేయి వేసుకుని నిలబడి ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)
వైరల్: కారును ఏకంగా ట్రాక్టర్‌లా మార్చేసిన కుర్రాడు!

అంతేకాక, వెనకవైపు "విడాకుల పార్టీ"( Divorce Party ) అనే బ్యానర్ కనిపించడంతో చాలా మంది షాక్ అయ్యారు.మంజీత్ తన స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి, పూలమాలలు వేసి విడాకుల పార్టీని ఘనంగా జరుపుకున్నాడు.ఈ వీడియోను వరం క్రితం షేర్ చేయగా కాస్త ఆలశ్యంగా వైరల్ అయ్యింది.

Advertisement

ఇప్పటి వరకు ఈ వీడియోను 6 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.వీడియోపై అనేక మంది నెటిజన్లు కామెంట్లు చేశారు.

కంగ్రాట్స్.నీ బాధ మాకు అర్థమవుతుంది అని కొందరు కామెంట్ చెయగా, "అభినందనలు సోదరా" అని మరికొందరు కామెంట్ చేశారు.

మరో నెటిజన్ అయితే, "నువ్వు ఎంత నొప్పిని అనుభవించావో మాకు అర్థమవుతోంది" అంటూ తన అభిప్రాయన్నీ కామెంట్ లో తెలిపాడు.

తాజా వార్తలు