మెడలో భారీ పాముతో మెట్రో ఎక్కాడు.. అందరినీ భయపెట్టేశాడు !

ఎక్కడైనా మీరు అకస్మాత్తుగా పామును( Snake ) చూస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా గుండె ఆగిపోతుంది.వెంటనే అక్కడ నుంచి అంతా పారిపోతారు.

అందులోనూ భారీ పాము, కొండచిలువలు అయితే ఇక పరుగులు పెడతారు.అయితే ఓ వ్యక్తి భారీ పాముతో చక్కగా ఆడుకుంటున్నాడు.

అంతేకాకుండా దానిని మెడ చుట్టూ వేసుకుని దర్జాగా మెట్రో ట్రైన్( Metro Train ) ఎక్కాడు.ఆశ్చర్యకర విషయం ఏమిటంటే మెట్రోలో ప్రయాణిస్తున్న వారు దానిని చూసి అస్సలు భయపడలేదు.

చక్కగా ఆ పాముతో కూడా ప్రయాణించారు.తమ సీట్లలోనే అలా కూర్చున్నారు.

Advertisement

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాములు కాటు వేస్తే ప్రాణం పోతుంది.ముఖ్యంగా కొన్ని రకాల విష సర్పాలు కాటు వేస్తే అతి కొద్ది నిమిషాలలోనే విషం శరీరం అంతా పాకుతుంది.ఇటీవల టొరంటో( Toronto ) మెట్రోలో ఓ వ్యక్తి చక్కగా ఎక్కాడు.

అయితే అతడి మెడలో భారీ పాము ఉంది.దానిని చూస్తే ఎవరైనా భయపడతారు.

పెద్ద మనిషిని అయినా అమాంతంగా మింగే పాము అది.అయితే అలాంటి పామును చూస్తే ఎవరైనా భయపడతారు.పామును మెడలో వేసుకున్న వ్యక్తి దానిని చాలా ప్రేమగా సాకుతున్నాడు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఛీ.. ఛీ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. చివరకు?

అతడు దానితో కలిసి మెట్రోలో ఎక్కగా ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందలేదు.

Advertisement

తమ సీట్లలో నింపాదిగా కూర్చున్నారు.అతి పెంపుడు పాము కావడంతో తమను ఏమీ చేయదని వారు దీమాగా ఉన్నారు.దీనిని @unilad అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

ఇక నెటిజన్లు మెట్రో అధికారులపై ఫైర్ అవుతున్నారు.ఆ పాము ఎవరినైనా కాటు వేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి ప్రమాదకర జీవులను మెట్రోలో ప్రయాణించడానికి అనుమతించడం ఏంటని కామెంట్లలో వ్యాఖ్యానిస్తున్నారు.ఇలాంటి మెట్రో రైళ్లలో అనుమతించి ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దని సూచిస్తున్నారు.

తాజా వార్తలు