బీఆర్ఎస్ ఏ ఎండకు అ గొడుగు పట్టే పార్టీ అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.బీఆర్ఎస్ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములు లూటీ చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ తో కుమ్మక్కై వారికి పది ఎకరాల భూమి కేటాయించారని విమర్శించారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
కాంట్రాక్టుల పేరుతో తెలంగాణ డబ్బులు కేసీఆర్ దోచుకున్నారన్నారు.తమ స్వార్థం కోసం పాలమూరు ప్రజలను వాడుకుంటున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ ఎన్నికల హామీలు నీటిమీద రాతలుగా మిగిలాయని దుయ్యబట్టారు.తెలంగాణలో మార్పు రావాలన్న కిషన్ రెడ్డి అది బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.