తౌబా వీడియో సాంగ్.. రెచ్చిపోయిన మాళవిక..!

మళయాళ భామ మాళవిక మోహనన్ ఎలాగైనా ఆడియెన్స్ ని అలరించాలని కేవలం సినిమాలే కాదు ప్రైవేట్ మ్యూజిక్ వీడియోస్ కూడా చేస్తుంది.

బాలీవుడ్ లో ఇలాంటి వీడియోస్ కి స్పెషల్ క్రేజ్ ఉంది.

ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే మాళవిక లేటెస్ట్ గా కెరియర్ లో ఫస్ట్ టైం ఓ మ్యూజిక్ వీడియో చేసింది.ర్యాపర్ బాద్షా పాడిన తౌబా సాంగ్ లో బాద్షాతో కలిసి ఆడింది మాళవిక మోహనన్.

బాలీవుడ్ లో అమ్మడి ఫస్ట్ వీడియో అవడం వల్ల గ్లామర్ షో విషయంలో ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది.వీడియో సాంగ్ లో మాళవిక మోహనన్ అందాలే స్పెషల్ హైలెట్ గా నిలిచాయని చెప్పొచ్చు.

పాయల్ దేవ్ మ్యూజిక్ అందించిన తౌబా స్పెషల్ వీడియో సాంగ్ ని బాద్షా, పాయల్ దేవ్ ఆలపించారు.స్క్రీన్ మీద బాద్షాతో మాళవిక మెప్పించింది.

Advertisement

వచ్చిన ప్రతి ఛాన్స్ వాడుకోవాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది.అందుకే అమ్మడు ఈ ప్రైవేట్ వీడియో ఆల్బం కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.

మళయాళ భామలు గ్లామర్ షో విషయంలో వెనకడుగు వేస్తారు.కానీ మాళవిక మాత్రం అందుకు భిన్నంగా స్కిన్ షోకి సై అనేస్తుంది.

ఈ తౌబా సాంగ్ ఆమె కెరియర్ కి మంచి బూస్టప్ ఇస్తుందని చెప్పొచ్చు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు