అంతరిక్షం నుంచి పడిన ఉల్కతో పర్స్ తయారీ.. దీని ధర ఎంతంటే

Making A Purse From A Meteorite That Fell From Space How Much Does It Cost, Making A Purse , Meteorite, Fell ,space,How Much Does It Cost, Koperni Meteorite Bag

మనకు అప్పుడప్పుడు అంతరిక్షం( space ) నుంచి ఉల్కలు పడే ప్రమాదం ఉందని వార్తల్లో వింటుంటాం.వాటి సైజులు కొన్ని చిన్నవి గానూ, కొన్ని కిలోమీటర్ల పరిధిలో దాదాపు నగరం అంత పెద్దవిగానూ ఉంటాయి.

 Making A Purse From A Meteorite That Fell From Space How Much Does It Cost, Maki-TeluguStop.com

అయితే ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది.ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీపై పలు దేశాల శాస్త్రవేత్తలు( Scientists ) గణనీయమైన అభివృద్ధి సాధించారు.

ఈ తరుణంలో అంతరిక్షంలో జరిగే మార్పులు, ఉల్కలు పడే ప్రమాదాల గురించి తెలుసుకుంటున్నారు.పెద్దవి, ప్రమాదకరమైన వాటిని అంతరిక్షంలోనే కూల్చేస్తున్నారు.

భూమిపై పడకుండా, ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే చిన్నపాటి ఉల్కలు అక్కడక్కడా పడుతుంటాయి.

వాటితో అంతగా ప్రమాదం ఉండదు.గాలిలోనే అవి మండిపోయి భూమి మీదకు వచ్చే సమయానికి చిన్నవి అయిపోతాయి.

ఇలాంటి ఉల్కను కొందరు వ్యాపార వస్తువుగా మార్చేశారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఉల్కలు వంటివి అంతరిక్షం నుంచి అప్పుడప్పుడు భూమిపై పడుతుంటాయి.ఆడిటీ సెంట్రల్ న్యూస్ వెబ్‌సైట్ ఇటీవల కీలక విషయాన్ని వెల్లడించింది.ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ కోపర్ని మెటోరైట్ బ్యాగ్( Koperni Meteorite Bag ) ఈ ఉల్కతో వెరైటీగా పర్స్ తయారు చేసింది.మీరు విన్నది నిజమే.

ఆ పర్సును చూడగానే అంతా ఆశ్చర్యపోతున్నారు.చూడడానికి ఉల్కలాగే ఉందని అనుకుంటున్నారు.

అయితే ఈ ఉల్కతో తయారు చేసిన పర్సును కొనాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.దీని బరువు సుమారు 2 కిలోలు ఉంటుంది.దీనిని కొనాలంటే రూ.35 లక్షలు చెల్లించాలి.అంత ఖర్చు పెట్టి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టినా, డెలివరీ చేయడానికి 6 వారాల సమయం పడుతుంది.అయితే నలుగురిలో విభిన్నంగా ఉండాలనుకునే వారికి కొదువ లేదు.

ముఖ్యంగా వెరైటీ పర్సులంటే మహిళలు మక్కువ చూపుతారు.దీంతో తమ ఉత్పత్తులకు ఢోకా ఉండదని ఆ కంపెనీ భావిస్తోంది.

Video : Making A Purse , Meteorite, Fell ,space,How Much Does It Cost, #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube