జేసీబీ వాహనాన్ని తయారు చేసిన పిల్లోడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే!

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ వినూత్నమైన ఆవిష్కరణలతో మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే వుంటారు.

అలాంటి అద్భుతమైన ఇన్నోవేషన్ల వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై నెటిజన్లను ఫిదా చేశాయి.

అయితే ఒక్కోసారి సాధారణ వస్తువులతో చేసే ఆవిష్కరణలు కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి.కాగా తాజాగా ఒక బుడ్డోడు సాధారణ వస్తువులతో జేసీబీ బ్యాక్‌హో లోడర్‌ లేదా డిగ్గర్ తయారు చేశాడు.

అది అచ్చం జేసీపీ లాగానే పనిచేస్తోంది.ఆ బాలుడు కలపతో దీనిని తయారు చేసి మట్టిని ఎత్తి పారబోస్తున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.ఈ వీడియోని ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్ @engineering_i0 అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

Advertisement

దీనికి ఇప్పటికే 21 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.వీడియో ఓపెన్ చేస్తే మీకు ఒక బాలుడు కర్రతో తయారుచేసిన జేసీబీపై కూర్చొని ఉండటం చూడవచ్చు.

ఆ తర్వాత అతడు దానిని ఆపరేట్ చేస్తూ మట్టిని తీసి అవతల పారపోశాడు.కర్రలతో దీన్ని తయారు చేయగా.

దాని చివరలో ఒక పాత్ర లాంటిది పెట్టాడు.చేతి దగ్గర ఆ పాత్రను ఆపరేట్ చేయడానికి వీలుగా మరొక కర్ర అమర్చాడు.

అలా చిన్నతనంలో అచ్చం జేసీపీ మోడల్‌ను తయారుచేసి ఆశ్చర్య పరుస్తున్నాడు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ పిల్లోడు తెలివిని మెచ్చుకుంటున్నారు.

వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!
వీడియో వైరల్ : అసలు బుద్ది ఉందా లేదా.. రీల్స్ కోసం ఇలా అవసరమా..

మరికొందరు మాత్రం ఈ మట్టి తొవ్వుతూ దానిని పక్కన పడేయడానికి పార బాగా పనికొస్తుందని.ఈ కర్ర జేసీబీ వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదని అంటున్నారు.

Advertisement

ఏది ఏమైనా దీన్ని తయారు చేయడానికి ఆ పిల్లోడు చాలా ఆలోచన చేసి ఉంటాడు.ఆ వయసులోనే జస్ట్ కలపతో దీనిని తయారు చేయడం గొప్పేనని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

తాజా వార్తలు