మహేష్ - ఎన్టీఆర్ కి ఇది నాలుగొవ పోటి .. గత మూడు సార్లలో గెలిచింది ఎవరంటే

చాలాకాలం తరువాత ఇద్దరు అటు ఇటుగా సమానమైన మార్కెట్ ఉన్న హీరోలు పోటిపడుతున్నారు.

ఈ ఏడాది చిరంజీవి - బాలకృష్ణ పోటిపడినా, ప్రస్తుతం ఇద్దరి మార్కెట్ సమానంగా లేదు.

చిరంజీవి మార్కేట్ పెద్ద స్థాయిలో ఉంటే, బాలకృష్ణ మార్కెట్ లో ఒకప్పటి ఊపు లేదు.ఇప్పుడు అందరి దృష్టి దసరా పోరు పైనే‌.

ఎందుకంటే టాప్ 3 లోని ఇద్దరు హీరోలు పోటిపడుతున్నారు.మహేష్ బాబు - ఎన్టీఆర్ మార్కేట్ అటుఇటుగా ఒకే స్థాయిలో ఉంటుంది.

ఇద్దరికి బలహీనమైన ట్రెడ్ ఏరియాలు ఉన్నాయి, బలమైన ట్రెడ్ ఏరియాలు ఉన్నాయి.ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా మహేష్ బాబు ఎప్పటిలాగే పైచేయి సాధించినా, ప్రమోషన్స్ మరియు హైప్ లో మాత్రం ఈరోజు వరకు ఎన్టీఆర్ ముందున్నాడు.

Advertisement

వీరిద్దరి మధ్య ఇది నాలుగొవ పోటి కావడం విశేషం.గత మూడు సార్లు వీరు పోటిపడ్డప్పుడు ఏం జరిగిందో మీరే చూడండి.2003 - 10 జనవరికి ఎన్టీఆర్ నటించిన నాగ విడుదల కాగా, 15 జనవరికి మహేష్ బాబు నటించిన ఒక్కడు విడుదలైంది.ఎన్టీఆర్ అప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు.

ఆది లాంటి బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్ కి అప్పటికే వచ్చేసింది.ఇక మహేష్ కి అప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ లేదు.

రాజకుమారుడు, మురారి వంటి హిట్స్ అయితే ఉన్నాయి.నాగ పైచేయి సాధిస్తుందేమో అనుకుంటే కథ రివర్స్ అయ్యింది.ఒక్కడుతో మహేష్ బాబు స్టార్ డమ్ మొదలైంది.2010 - వారం తేడాలో వచ్చాయి ఖలేజా, బృందావనం.ఎన్టీఆర్ రివేంజ్ తీసుకున్నాడు.

ఇటు బృందావనం, అటు రోబో ‌.రెండు సినిమాల మధ్య నలిగిపోయింది ఖలేజా.మూడు సంవత్సరాల తరువాత తిరిగొచ్చిన మహేష్ అభిమానుల్ని నిరుత్సాహపరిస్తే, ఓ సరికొత్త రూపంలో ఎన్టీఆర్ అభిమానుల్ని, ప్రేక్షకులని అలరించాడు.2011 - సెప్టెంబరు 23న దూకుడుతో వచ్చాడు మహేష్, అక్టోబర్ 6న ఊసరవెళ్లితో వచ్చాడు ఎన్టీఆర్.ఈసారి మహేష్ దే పైచేయి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : విమానంలో కొట్టేసుకున్న ప్రయాణికులు.. చివరకు..

దూకుడు రికార్డు బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఊసరవెళ్ళి తుస్సుమంది.2017 - ఆరు సంవత్సరాల తరువాత ఇద్దరు పోటిపడుతున్నారు.21న జైలవకుశ, 27న స్పైడర్.మరి మహేష్ 2-1 లెక్కని 3-1 చేస్తాడో, లేక యంగ్ టైగర్ 2-2 చేసి లెక్క సరిచేస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు