సూపర్ స్టార్ తల్లి ఇందిరా దేవి అంత్యక్రియలపై లేటెస్ట్ అప్డేట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట విషాదం చోటు చేసుకుంది.ఆమె తల్లి ఇందిరా దేవి గారి మరణంతో మహేష్ బాబు ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 Mahesh Babu's Mother Shri Ghattamaneni Indira Devi Passes Away, Indira Devi, Mah-TeluguStop.com

ఈ రోజు ఉదయం ఇందిరా దేవి గారి మరణ వార్త విని ఘట్టమనేని వారి ఇంట మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా తీరని విషాదం చోటు చేసుకుంది.దీంతో ఈ వార్త విని టాలీవుడ్ ప్రముఖులు మహేష్ బాబుతో పాటు సూపర్ స్టార్ కృష్ణను పరామర్శించి వారికీ ధైర్యం చెబుతున్నారు.

మన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు మహేష్ బాబు తల్లి మరణించడంతో సంతాపం తెలుపు తున్నారు.ఆమె ఆరోగ్య సమస్యలతో మరణించినట్టు తెలుస్తుంది.హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించడంతో మహేష్ బాబు, కృష్ణ లు ఈ వార్త విని క్రుంగి పోతున్నారు.కృష్ణ గారికి ఇందిరా దేవి మొదటి భార్య.

 Mahesh Babu's Mother Shri Ghattamaneni Indira Devi Passes Away, Indira Devi, Mah-TeluguStop.com

అయితే ఈమె తర్వాత విజయనిర్మలను పెళ్లి చేసుకున్నాడు.అయినా ఇందిరా గారికి కానీ పిల్లలకు కానీ ఏ లోటు లేకుండా చూసుకున్నారు.

2018లో విజయ నిర్మల మరణించడంతో క్రుంగి పోయిన కృష్ణ కాస్త కోలుకునే లోపే ఇటీవలే కొడుకు రమేష్ బాబు మరణించాడు.దీంతో కృష్ణ గారితో పాటు మహేష్ బాబు కు అన్నను కోల్పోయి చాలా క్రుంగి పోయారు.దీని నుండి కోలుకునే లోపే మళ్ళీ తల్లి మరణించడంతో మహేష్ మరోసారి ఎమోషనల్ అయ్యారు.ఇది ఇలా ఉండగా ఇందిరా దేవి గారి అంత్యక్రియలు గురించి తాజాగా ఒక సమాచారం బయటకు వచ్చింది.

Telugu Krishna, Indira Devi, Mahesh Babu, Maheshbabus-Movie

ఈమె అంత్యక్రియలను ఎప్పుడు, ఎలా నిర్వహిస్తారో అనే సమాచారం తాజాగా బయటకు వచ్చింది.ఇందిరా గారి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరగనున్నట్టు తెలుస్తుంది.ఈమె పార్థివ దేహాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోస్ లో ఉంచుతారు.ఆ తర్వాత జూబ్లీ హిల్స్ లో మహాప్రస్థానంలో ఈమె అంత్యక్రియలు జరగనున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube