చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేసిన మహేష్ బాబు..!!

ఏపీ ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించటం తెలిసిందే.అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఘోరంగా ఓడిపోయింది.

 Mahesh Babu Wishes Chandrababu, Mahesh Babu, Chandrababu , Cine Politicians, Yc-TeluguStop.com

కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలలో మాత్రమే గెలవడం జరిగింది.దీంతో  అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.

జూన్ 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandrababu ) ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి చాలామంది రాజకీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) సోషల్ మీడియాలో చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు.“ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అద్భుత విజయం సాధించిన చంద్రబాబుకి హృదయపూర్వక శుభాకాంక్షలు.మీ టర్మ్ విజయవంతంగా సాగాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.ఇదిలా ఉంటే జూన్ 9వ తారీకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు( Cine Politicians ) హాజరు కాబోతున్నారు.ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి.2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం ఎప్పుడు ఘన విజయం సాధించింది.2024 ఎన్నికలను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి చివరాఖరికి ఘనవిజయం సాధించారు.ఈ ఎన్నికలలో మొత్తం 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాలలో కూటమి గెలవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube