ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు కూటమి గెలుపు గురించి రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.
కూటమి గెలుపు గురించి నందమూరి చైతన్యకృష్ణ( Nandamuri Chaitanya Krishna ) రియాక్ట్ కావడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.మా మామయ్య నారా చంద్రబాబు నాయుడుకి( Nara Chandrababu Naidu ) శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నానని చైతన్యకృష్ణ పేర్కొన్నారు.
మామయ్య కుప్పంలో అఖండ మెజారిటీతో గెలుపొందారని చైతన్యకృష్ణ పేర్కొన్నారు.అత్తయ్య పురంధేశ్వరికి( Purandeshwari ) సైతం అభినందనలు తెలియజేయాలని అనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.అత్తయ్య అఖండ మెజార్టీతో రాజమండ్రి లోక్ సభ అభ్యర్థిగా గెలిచారని చైతన్యకృష్ణ కామెంట్లు చేశారు.బాబాయ్ బాలయ్య హిందూపూర్ నుంచి మూడోసారి హ్యాట్రిక్ సాధించి అద్భుత మెజారిటీతో గెలిచారని చైతన్యకృష్ణ చెప్పుకొచ్చారు.
మామయ్య కొడుకు నారా లోకేశ్( Nara Lokesh ) కూడా భారీ మెజార్టీతో గెలిచారని చైతన్యకృష్ణ కామెంట్లు చేశారు.బాబాయ్ అల్లుడు భరత్ కూడా విశాఖ నుంచి గెలిచారని ఆయన పేర్కొన్నారు.నందమూరి చైతన్య కృష్ణ చేసిన కామెంట్స్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి.చైతన్య కృష్ణ భవిష్యత్తులో సినిమాలలో కెరీర్ ను కొనసాగిస్తారో లేదో తెలియాల్సి ఉంది.
చైతన్య కృష్ణ నటించిన బ్రీత్ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.చైతన్య కృష్ణ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.చైతన్య కృష్ణ మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.నందమూరి చైతన్య కృష్ణ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
హీరో నందమూరి చైతన్య కృష్ణ భవిష్యత్తులో రాజకీయాలపై దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది.