గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి అదనపు కలెక్టర్ పూజారి గౌతమి

రాజన్న సిరిసిల్ల జిల్లా: టీజీపీఎస్సీ ఆదేశాలకు అనుగుణంగా గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని చీఫ్ సూపర్ ఇండెంట్లు, అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆదేశించారు.గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ పై చీఫ్ సూపర్ ఇండెంట్లు, అబ్జర్వర్ల తో సమీక్ష సమావేశం బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం లో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి నిర్వహించారు.

 Additional Collector Pujari Gauthami Should Be Vigilant In Conducting Group-1 Pr-TeluguStop.com

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు.పరీక్షా సెంటర్లలో కావలసిన అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, సీటింగ్ అరేంజ్మెంట్, దివ్యాoగులకు కావలసిన స్క్రైబ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇన్విజిలేటర్లకు పకడ్బందీ శిక్షణ ఇచ్చి పరీక్ష రోజు ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని, ఓఎంఆర్ షీట్స్ జాగ్రత్తగా నిర్వహించుకోవాలని సమయపాలన పాటించాలని బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు నియమించుకొని వారికి శిక్షణ ఇప్పించి వారిచే 100% అటెండెన్స్ నమోదు అయ్యేట్లుగా చూడాలని ఆదేశించారు.చీఫ్ సూపర్డెంట్లు ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని ఇన్విజిలేటర్లను లాటరీ సిస్టంలో సెలెక్ట్ చేయాలని సూచించారు.

పరీక్ష సెంటర్లో ఒక్క చీఫ్ సూపర్ ఇంటెండెంట్ తప్ప ఎవరు కూడా సెల్ ఫోన్ వాడకూడదని స్పష్టం చేశారు.దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లో అలాట్మెంట్ చేయాలని వారికి కావలసిన సదుపాయాలను చేయాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ వడ్లూరి శ్రీనివాస్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ మధు రాజేష్, 30 మంది చీఫ్ సూపర్డెంట్లు అబ్జర్వర్లు సిబ్బంది పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube