టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సినిమా షూటింగ్ సమయంలో ఏ మాత్రం ఖాళీ దొరికినా తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళుతూ ఎంతో ఎంజాయ్ చేస్తారు.కొన్నిసార్లు మహేష్ బాబు విదేశాలలో షూటింగ్ లో ఉంటే తన కుటుంబంతో కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటారు.
ముఖ్యంగా పిల్లల విషయంలో మహేష్ బాబు పూర్తి తన సమయాన్ని పిల్లలతో కేటాయించడానికి ఎంతో ఇష్టపడతారు.
ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్లో జరుగుతోంది.ఈ క్రమంలోనే మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ కూతురు సితారతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో చిన్న పిల్లాడిగా మారిపోయి తన పిల్లలతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్ప్రింగ్ సీజన్ లో ఇలా పిల్లలతో కలిసి వాటర్ లో ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా ఉందని కామెంట్ పెట్టారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.
త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నారు.ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీకానున్నారు.