అప్పట్లో మహేష్ బాబు ఆమెపై మనసు పడ్డాడట... కానీ

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రిన్స్ మహేష్ బాబుకి ఉన్నటువంటి క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు.

అయితే మహేష్ బాబు తండ్రి ఒకప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ గా వెలుగొందినప్పటికీ మహేష్ బాబు మాత్రం తన కుటుంబ సినీ బ్యాక్ గ్రౌండ్ ని ఉపయోగించుకోకుండా సొంతంగా కష్టపడి తనకంటూ తన అభిమానుల్లో ఓ ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు.

అయితే ప్రస్తుతం ఎలాంటి చిత్రం షూటింగ్ లేకపోవడంతో మహేష్ బాబు సరదాగా కొంత సేపు తాజాగా సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో ముచ్చటించాడు.అయితే ఈ ముచ్చట్లలో భాగంగా పలువురు నెటిజన్లు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చాడు.

అయితే ఇందులో ఓ నెటిజన్ మీ ఫస్ట్ క్రష్ గురించి తెలియజేయాలని అడిగాడు.దీంతో మహేష్ బాబు స్పందిస్తూ తన మొదటి క్రష్, లవ్, సోల్ మేట్, తన భార్య నమ్రతా శిరోద్కర్ అంటూ తనదైన శైలిలో  సంధానం ఇచ్చాడు.

 దీంతో నెటిజన్లు అంతా ఒక్కసారిగా నమ్రతా శిరోద్కర్ మరియు మహేష్ బాబులది గ్రేట్ లవ్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా మహేష్ బాబు అందుబాటులో ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కి మాత్రం తక్కువగా అందుబాటులో ఉంటాడు.

Advertisement

కానీ ఈ మధ్య కాలంలో మాత్రం మహేష్ తన అభిమానుల ప్రశ్నలకి మరియు సమస్యలకి బాగానే రెస్పాండ్ అవుతున్నాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పరుశురాం దర్శకత్వం వహిస్తున్న "సర్కారు వారి పాట" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాతలు రామ్ ఆచంట మరియు గోపి ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాగా తొంర్లోనే ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్రీకరణ పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా భరత్ అను నేను ఫేమ్ కీయారా అద్వానీ నటిస్తున్నట్లు సమాచారం.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు