అల ఎఫెక్ట్‌ తో సర్కారు వారి పాటకు రూ.10 కోట్లు ఖాయమా?

గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ఆ సినిమా ఆడియో అంతకు మించిన సక్సెస్ ను దక్కించుకన్న విషయం తెల్సిందే ఆ సినిమా పాటలు ఇప్పటికి కూడా ట్రెండ్డింగ్‌ లోన ఉన్నాయి.

వందల మిలియన్‌ లను క్రాస్ చేసి బిలియన్ వ్యూస్‌ దిశగా ఈ సినిమా పాటలు దూసుకు పోతున్నాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు.ఆ సినిమా తో థమన్ బిగ్గెస్ట్‌ సక్సెస్ ను కెరీర్ లో దక్కించుకున్నాడు.

అద్బుతమైన ఆల్బం ను అందించిన థమన్ సౌత్‌ లో టాప్‌ స్టార్‌ సంగీత దర్శకుడిగా మారిపోయాడు.ఇప్పుడు ఆయన సర్కారు వారి పాట సినిమా కు గాను సంగీతాన్ని అందిస్తున్నాడు.

థమన్‌ కు ఉన్న క్రేజ్ మరియు మహేష్‌ బాబు కు ఉన్న క్రేజ్ ల నేపథ్యంలో సినిమా కు అద్బుతమైన రెస్పాన్స్ వస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Advertisement

ఇటీవల కేజీఎఫ్‌ 2 ఆడియో రైట్స్‌ ను దాదాపుగా ఏడు కోట్ల రూపాయలకు గాను లహరి టీ సిరీస్ వారు కొనుగోలు చేయడం జరిగింది.ఇప్పుడు తెలుగు సినిమాల పాటలకు విపరీతమైన స్పందన వచ్చింది.అది కూడా అల వైకుంఠ పురంలో సినిమా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యింది.

అందుకే థమన్ ట్యూన్స్ చేస్తున్న సర్కారు వారి పాట ఆడియో కూడా అద్బుతంగా సక్సెస్ ను దక్కించుకుంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.కనుక సర్కారు వారి పాట ఆడియో రైట్స్ ద్వారా ఖచ్చితంగా పది కోట్ల వరకు సంపాదించడం ఖాయం అంటున్నారు.

సర్కారు వారి పాట నుండి మొదటి పాటను దసరా కానుకగా విడుదల చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పరశురామ్‌ దర్శకత్వం లో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారని టాక్‌ వినిపిస్తుంది.

ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు