డబ్బులు తీసుకుని సినిమాకు రివ్యూ ఇచ్చావా బాబు?

యూట్యూబర్ సుమంత్ ప్రభాస్( Sumanth Prabhas ) హీరోగా నటించిన చిత్రం మేమ్ ఫేమస్‌.

( Mem Famous ) నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

స్వీయ దర్శకత్వంలో సుమంత్‌ ప్రభాస్ ఈ సినిమా ను రూపొందించడం జరిగింది.హీరోగా నటిస్తూనే దర్శకత్వం చేయడం అంటే కచ్చితంగా రిస్కీ జాబ్‌.

అయినా కూడా సుమంత్‌ ప్రభాస్ బాగానే ప్రయత్నించాడు.అయితే సినిమా లో కాస్త కథ మరియు కథనంపై పట్టు మిస్ అయ్యిందంటూ రివ్యూలు వస్తున్నాయి.

అయితే సినిమా విడుదలకు ముందు ఒక రివ్యూ వచ్చింది.ఆ రివ్యూ అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు మేమ్‌ ఫేమస్ సినిమా స్థాయిని అమాంతం పెంచడం జరిగింది.

Advertisement

కానీ తీరా చూస్తే సినిమా అంత లేదు అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

ఇంతకు సినిమా విడుదలకు ముందు రివ్యూ ఇచ్చింది ఎవరో తెలుసు కదా.ఔను మహేష్ బాబు( Mahesh Babu ) సినిమాను చూసి బాగుంది అంటూ కితాబిచ్చారు.మహేష్ బాబు ట్వీట్‌ తో రాత్రికి రాత్రి సినిమా యొక్క స్థాయి అమాంతం పెరిగింది.

ఇప్పుడు సినిమా నిరాశ పర్చడంతో కొందరు యాంటీ మహేష్ బాబు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ఓ రేంజ్ లో ఆట ఆడేసుకుంటున్నారు.మహేష్ బాబు టీమ్‌ డబ్బులు తీసుకుని మేమ్‌ ఫేమస్ సినిమా కి రివ్యూ ఇప్పించి ఉంటారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు సినిమా ను చూశారో లేదో తెలియదు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఆయన యొక్క సోషల్‌ మీడియా టీమ్‌ ఈ పని చేసిందేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఈ విషయంలో చాలా ఆసక్తికర చర్చ జరుగుతోంది.డబ్బులు తీసుకుని రివ్యూలు ఇచ్చే వారు కూడా ఉంటారు.

Advertisement

అయితే చిన్న సినిమాకు మహేష్ బాబు డబ్బులు తీసుకుని రివ్యూలు ఇచ్చేంత అవసరం లేదు.ఆయనకు డబ్బులు ఇచ్చేంత స్థాయి మేమ్‌ ఫేమస్ సినిమా యొక్క మేకర్స్ ది కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబుకు నిజంగానే సినిమా నచ్చి రివ్యూ ఇచ్చి ఉంటారు.అంత మాత్రాన అందరికి నచ్చాలని లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు