నేను హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు.. మహేష్ షాకింగ్ వ్యాఖ్యలు!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాను డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 12న విడుదల కాబోతుంది.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తునట్టు ఇప్పటికే ప్రకటించాడు.వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.

దాదాపు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబో రిపీట్ అవుతుంది.అందుకే ఈ హ్యాట్రిక్ సినిమాను సూపర్ హిట్ చేయాలనీ త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.

Advertisement

ఈ సినిమా కూడా పూర్తి అయినా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

అయితే తాజాగా మహేష్ బాబు షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు.ఇక ఈ గ్యాప్ లో బుధవారం రోజు హైదరాబాద్ బెస్ట్ మొబైల్ పేమెంట్స్ యాప్ క్విక్ ఆన్ ను లాంచ్ చేసాయడానికి వచ్చారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ పాన్ ఇండియా సినిమా గురించి అడిగారు.

అప్పుడు మహేష్ ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాడు.

ప్రస్తుతం అందరు స్టార్ హీరోలు హిందీ సినిమా చేస్తున్నారు.మీరు ఎప్పుడు చేస్తారు అని మహేష్ బాబును మీడియా ప్రశ్నించారు.అప్పుడు మహేష్ నేను హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

త్వరలోనే రాజమౌళి తో చేస్తున్న సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ కానుంది అంటూ ఆన్సర్ ఇచ్చాడు.సౌత్ ఇండస్ట్రీ పై ప్రెసెంట్ హిందీ నటులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న.

Advertisement

మన సౌత్ స్టార్స్ మాత్రం ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే అని చెప్పడం తో మన హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ తమ హీరోలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

తాజా వార్తలు