టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో రీలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో మహేష్ మరోసారి తన సత్తాను చాటాడు.
కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని గీతా గోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ క్రమంలో ఎప్పటి నుండో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది.
దీంతో ఇప్పుడు మహేష్‌తో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని జక్కన్న స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో జక్కన్నతో తన సినిమా గురించిన ప్రకటనను మే 31న చేయడానికి మహేష్ రెడీ అవుతున్నాడు.
అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మహేష్‌తో జక్కన్న చేయబోయే సినిమా ఆర్ఆర్ఆర్ కంటే కూడా భారీగా ఉండనుందట.
ఈ సినిమాలో మహేష్ ఒక్కడే కాకుండా ఏకంగా ముగ్గురు హీరోలు ఉంటారని తెలుస్తోంది.
ఇది ఆర్ఆర్ఆర్ కంటే కూడా భారీ మల్టీస్టారర్ మూవీగా ఉండబోతుందని తెలుస్తోంది.అయితే ఆర్ఆర్ఆర్ కంటే కూడా భారీ మూవీ అంటే ప్రేక్షకులు ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువని విమర్శకులు అంటున్నారు.
మహేష్ సోలో హీరోగా జక్కన్న సినిమా చేస్తే బాగుంటుందని, ఈ సినిమా వైవిధ్యంగా ఉంటే ఇక రికార్డులను ఆపడం ఎవరి తరం కాదని వారు అంటున్నారు.మరి జక్కన్న మహేష్‌తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.