టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఏ సినిమా అయినా తెరకెక్కిస్తున్నారు అంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టింస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోనే బాహుబలి సినిమాను తెరకెక్కించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం RRR.ఈ సినిమా జనవరి 7వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి.
ఈ సినిమా తరువాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.ఇది హాలీవుడ్ తరహాలో ఉండబోతోందని సమాచారం.ఇప్పటికే ఈ సినిమా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారని సమాచారం.అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.
ఇదిలా వుండగా తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ చిత్రంలో రాజమౌళి మహేష్ బాబుతో పోటీ పడటానికి ఒక స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.

ఐ, అవతార్, మల్లన్న వంటి చిత్రాలలో విభిన్న పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో విక్రమ్ అయితే సరిగ్గా సరిపోతాడని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే మహేష్ బాబు తో రాజమౌళి చేయబోయే సినిమాలో విలన్ గా విక్రమ్ ఉండబోతున్నారని సమాచారం.అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉంది లేదు అనే విషయం గురించి చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేసిన అనంతరం మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు.