మహేష్‌ గారు మనవాళ్లు ఏం పాపం చేశారో చెప్తారా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈమద్య కాలంలో పలు సినిమాలకు స్పందించాడు.

తనకు నచ్చిన ప్రతి సినిమా గురించి మహేష్‌ బాబు ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో స్పందిస్తూనే ఉన్నాడు.

ఇటీవలే రాక్షసన్‌ చిత్రం గురించి ఆ తర్వాత మరో సినిమా గురించి ఇప్పుడు తమిళంలో వచ్చిన ఖైదీ సినిమా గురించి స్పందించాడు.కార్తీ హీరోగాన టించిన ఖైదీ సినిమాపై ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.

ఖైదీ సినిమాను ఇటీవలే మహేష్‌బాబు చూశాడట.ఈ సినిమాలో కార్తీ విభిన్నమైన పాత్రను పోషించాడు.

కొత్త తరహా మేకింగ్‌ సినిమా ఇది, ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలంటూ ఆకాంక్షిస్తున్నాను.సినిమా చాలా బాగుంది.

Advertisement
Mahesh Babu About Karthi Khaidi-మహేష్‌ గారు మనవాళ

నాకు నచ్చింది అంటూ సోషల్‌ మీడియాలో మహేష్‌బాబు పోస్ట్‌ చేశాడు.ఈ విషయమై మహేష్‌బాబు స్పందన కొందరికి మింగుడు పడటం లేదు.

ముఖ్యంగా మెగా నందమూరి అభిమానులు మహేష్‌బాబు ట్వీట్స్‌కు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Mahesh Babu About Karthi Khaidi

ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు నీకు స్నేహితులు అంటావు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో నీకు చాలా మంది సన్నిహితులు స్నేహితులు ఉన్నారు.వారు ఎన్నో మంచి సినిమాలు చేసినా కూడా నీవు స్పందించడం లేదు.

కాని తమిళంలో వస్తున్న చిన్నా చితకా సినిమాలకు ఆహా ఓహో అంటూ స్పందిస్తున్నావు.తెలుగు హీరోలు అంటే నీకు అంత చులకన ఎందుకు అంటూ ప్రశ్నించారు.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లేటెస్ట్ రెమ్యునరేషన్ లెక్కలివే.. అంత తీసుకుంటున్నారా?

అసలు తెలుగు స్టార్స్‌ ఏం పాపం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తు కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు