మహేష్‌ 25వ చిత్రం మారిందా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజాగా ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌ బాబు 24వ చిత్రంగా వచ్చిన భరత్‌ టాలీవుడ్‌ రికార్డులను బ్రేక్‌ చేసి టాప్‌ చిత్రాల జాబితాలో స్థానం దక్కించుకుంది.

అంతటి గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత మహేష్‌బాబు తన 25వ చిత్రంపై కాస్త ఎక్కువ ఫోకస్‌ పెట్టడం చాలా సహజం.దాదాపు ఆరు నెలల క్రితమే మహేష్‌బాబు 25వ చిత్రం ఖరారు అయ్యింది.

దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు సంయుక్తంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ 25వ సినిమాను నిర్మించబోతున్నారు.ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగి పోయాయి.

మహేష్‌ 25వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కాబోతుందని అంతా భావిస్తున్న సమయంలో షాకింగ్‌గా మహేష్‌బాబు తన 25వ సినిమాను మార్చుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.వంశీ పైడిపల్లి రూపొందించిన కథ ఒక హాలీవుడ్‌ సినిమాకు కాపీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ప్రతిష్టాత్మక 25వ చిత్రానికి ఇలాంటి విమర్శలు రావడంతో మహేష్‌బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Advertisement

రంగస్థలం విడుదలైన వెంటనే మహేష్‌బాబు, సుకుమార్‌ల కాంబో మూవీ ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.మహేష్‌బాబు 26వ చిత్రాన్ని సుకుమార్‌ దర్శకత్వం వహించాల్సి ఉంది.కాని పరిస్థితులు మారడంతో మహేష్‌ 25వ చిత్రంగా సుకుమార్‌ దర్శకత్వంలో మూవీ రాబోతుంది.

అతి త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఇటీవలే దర్శకుడు సుకుమార్‌ మరి కొన్ని రోజుల్లోనే మహేష్‌బాబుతో తన సినిమాను ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించాడు.

ఇంకా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా షురు కాలేదు, అప్పుడే సుకుమార్‌ ప్రకటించాడు అంటే ఖచ్చితంగా వంశీ పైడిపల్లి సినిమా పక్కకు నెట్టేసినట్లే అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.మహేష్‌బాబు 25వ సినిమాపై ఎక్కువ దృష్టి పెట్టాడు.ప్రతిష్టాత్మక 25వ చిత్రం అవ్వడం వల్ల సుకుమార్‌ దర్శకత్వంలో చేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడు.26వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా ఉండే అవకాశం ఉంది.మహేష్‌, సుకుమార్‌ల కాంబోలో గతంలో ‘1’ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే.

సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.దాంతో సుకుమార్‌ చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నాడు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest

రంగస్థలం వంటి బ్లాక్‌ బస్టర్‌ను మహేష్‌కు అందించేందుకు సుకుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు