భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీది ప్రత్యేక స్థానం.చెన్నై (సీఎస్కే) సారథి ధోని కొత్త స్పోర్ట్స్ లుక్స్ తో అదరగొడుతున్నాడు.
ఐపీఎల్ ఆరంభంకానుంది.ఈ నేపధ్యం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ధోనీ న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేసింది.
సెప్టెంబర్ 19 నుంచి మొదలయ్యే ఐపిఎల్ రెండో దశ. చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఆరంభంకానుంది.ఐపీఎల్ యాజమాన్యం తాజాగా విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలను ధోని కొత్త లుక్ అభిమానులను అలరించాడు. ఐసీసీ ట్రోఫీ సాధించి పెట్టిన ఒకే ఒక్క కెప్టెన్ గా ఘనత సాధించిన ధోనీ.
ఆటల్లోనే కాదు.తన ఆహార్యం లోనూ స్టైలిష్ గా కనిపిస్తాడు.
క్రికెట్ కెరీర్ లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో స్టైల్ లో కనిపించాడు.ఒక్కో స్టైల్ లో అదిరిపోయేలా ఉండడంతో యువత ధోనీ స్టైల్ అంటూ అభిమానులు సెలూన్ షాప్ లకు పరిగెడుతూంటారు.

ఇప్పుడు మళ్ళి ధోని మరో హెయిర్ స్టైల్ తో కొత్త లుక్ లో కనిపించాడు.ప్రత్యేక హెయిర్ స్టైల్ చేసి న్యూ లుక్ లో మెరిసేలా ఆలివ్ ధోనిని తయారు చేశారు.కుర్రకారును తెగ ఆకర్షిస్తుంది.పాతికేళ్ళ కుర్రోడులా కనిపిస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ధోని గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే… ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై జట్టుతో ఆడుతున్నాడు.